Pakistan: భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి.. క్రికెట్‌లో విజయం తరువాత ఇది మంచి సమయం కాదు..ఇమ్రాన్ వింత ప్రకటన!

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచిత్రమైన ప్రకటన చేశారు. రాజకీయాలకు..క్రికెట్ కు ముడిపెట్టారు. ఆయన సోమవారం భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని ఎత్తిచూపిస్తూనే.. T20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తమ ఘన విజయం తర్వాత ఇటువంటి చర్చలకు ఇది మంచి సమయం కాదని అన్నారు.

Pakistan: భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి.. క్రికెట్‌లో విజయం తరువాత ఇది మంచి సమయం కాదు..ఇమ్రాన్ వింత ప్రకటన!
Imran Khan
Follow us
KVD Varma

|

Updated on: Oct 26, 2021 | 2:35 PM

Pakistan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచిత్రమైన ప్రకటన చేశారు. రాజకీయాలకు..క్రికెట్ కు ముడిపెట్టారు. ఆయన సోమవారం భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని ఎత్తిచూపిస్తూనే.. T20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తమ ఘన విజయం తర్వాత ఇటువంటి చర్చలకు ఇది మంచి సమయం కాదని అన్నారు. రియాద్‌లో జరిగిన పాకిస్తాన్‌-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌ వృద్ధి సామర్థ్యం గురించి మాట్లాడారు. దేశ యువత వ్యూహాత్మక స్థితిని హైలైట్ చేశారు. అలాగే పాకిస్తాన్ కు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద మార్కెట్లు ఉన్నాయని, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మధ్య ఆసియా మార్కెట్లకు ప్రాప్యత ఉందని చెప్పారు. చైనాతో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే భారత్‌తో మన సంబంధాలను ఎలాగైనా మెరుగుపరుచుకుంటే బాగానే ఉంటుందని చెప్పారు. ఇలా అంటూనే ఈ విషయాన్ని క్రికెట్ లో పాక్ విజయంతో ముడిపెట్టారు. ”గత రాత్రి క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టును ఓడించిన తర్వాత భారత్‌తో సంబంధాలు మెరుగుపడటం గురించి నాకు తెలుసు, ఇది మాట్లాడటానికి గొప్ప సమయం కాదు.” అని ప్రకటించారు.

ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ తొలిసారి విజయం సాధించింది

ప్రపంచకప్‌లో భారత్‌ను తొలిసారి ఓడించి పాకిస్తాన్‌చరిత్ర సృష్టించిన మరుసటి రోజే ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 13 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో (50 ఓవర్ల ప్రపంచకప్‌లో ఏడు మరియు 20-20 ప్రపంచకప్‌లో ఆరు) పాకిస్థాన్‌కు ఈ విజయం మొదటిది. రియాద్‌లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, రెండు దేశాలకు ఒకే సమస్య ఉందని, అది భారత ఆక్రమిత కాశ్మీర్ అని, నాగరిక పొరుగు దేశాల మాదిరిగా దీనిని పరిష్కరించుకోవాలని కోరారు. 72 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హామీ ఇచ్చినట్లుగా, ఇది మానవ హక్కులు, కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారానికి సంబంధించినది. వారికి ఈ హక్కు కల్పిస్తే మనకు మరో సమస్య ఉండదు. రెండు దేశాలు నాగరిక పొరుగు దేశాలుగా జీవించగలవు అని అయన చెప్పారు. పాకిస్తాన్‌ ద్వారా మధ్య ఆసియాలో భారత్ ప్రవేశం పొందుతుందని, దానికి ప్రతిగా రెండు పెద్ద మార్కెట్లకు ప్రవేశం లభిస్తుందని ఇమ్రాన్అన్నారు.

ముందుచూపుతో పాటు రిస్క్‌లు తీసుకునేవారే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలని ఇమ్రాన్ ఈ సందర్భంగా అన్నారు. అణచివేతకు గురైన మార్గంలో నడిచే వారు, వ్యాపారాన్ని పక్కనపెట్టి, ఏ రంగంలోనూ రాణించలేరు. పాకిస్తాన్‌ వ్యూహాత్మక స్థానాన్ని మరోసారి ఎత్తిచూపిన ప్రధాని, సౌదీ వ్యాపారులు ఆ దేశం ఆఫర్ నుండి ప్రయోజనం పొందవచ్చని అన్నారు. రావి రివర్‌ఫ్రంట్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్,సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్‌లను ప్రస్తావించిన ఆయన పెట్టుబడిదారులకు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి: Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..

Ind vs Pak T20 Match : విజయగర్వంతో ఎగిరెగిరి పడుతున్న పాక్.. నోటి దూలతో రెచ్చిపోయిన పాక్ మంత్రి..

Madhavan: కొడుకును ఇలా పెంచాలి.. మాధవన్‌పై ప్రముఖుల ప్రశంసలు.. ఎందుకో తెలుసా..