AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 లక్షల గ్లోవ్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు

కరోనా కష్టకాలంలో గ్లోవ్స్‌ కూడా మన జీవితంలో భాగమయ్యాయి. బయట ఉన్న వారి గురించి పక్కనపెడితే ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బందికి వీటి అవసరం చాలా ఉంది

60 లక్షల గ్లోవ్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 27, 2020 | 4:17 PM

Share

Gloves Theft in US: కరోనా కష్టకాలంలో మాస్క్‌లతో పాటు గ్లోవ్స్‌ కూడా మన జీవితంలో భాగమయ్యాయి. ముఖ్యంగ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బందికి వీటి అవసరం చాలా ఉంది. అయితే ఇలా ఆసుపత్రుల కోసం ఉంచిన 60 లక్షల గ్లోవ్స్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. కోరల్‌ స్ప్పింగ్స్‌లోని మెడ్గ్‌లవ్‌ అనే ఓ సప్లయర్ సంస్థ శుక్రవారం రాత్రి మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.37కోట్లు) విలువ చేసే గ్లోవ్స్‌ని అందుకుంది. అయితే ఆదివారం రాత్రి కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ కంటైనర్‌ని కొందరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మొత్తం అక్కడి కెమెరాల్లో రికార్డు అయ్యింది.

దీనిపై మెడ్గ్‌లవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్‌ గ్రిమ్స్ మాట్లాడుతూ.. ఫ్లోరిడాలోని పలు ఆసుపత్రులకు గ్లోవ్స్ అవసరం ఇప్పుడు చాలా ఉందని అన్నారు. గత వారం రోజులుగా పలు ఆసుపత్రుల వారు ఫోన్ చేసి గ్లోవ్స్ ఎప్పుడూ వస్తాయి..? అని అడుగుతూ ఉన్నారని, ఈ దొంగతనం చాలా బాధించిందని పేర్కొన్నారు.

Read More:

రాందాస్‌ అథవాలేకు కరోనా.. నిన్న కేంద్రమంత్రి ప్రెస్‌మీట్‌కి హాజరైన పలువురు

ఏపీలో కొత్త జిల్లాలపై జనవరి 26న స్పష్టమైన ప్రకటన: డిప్యూటీ స్పీకర్

Follow Us