ఏపీలో కొత్త జిల్లాలపై జనవరి 26న స్పష్టమైన ప్రకటన: డిప్యూటీ స్పీకర్

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు.

  • Manju Sandulo
  • Publish Date - 2:43 pm, Tue, 27 October 20

Andhra Pradesh New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా.. అరకు నియోజకవర్గంలో సంక్లిష్టత ఏర్పడిందని.. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు అవుతాయని ఆయన వివరించారు. ఇక వాన్‌ పిక్ భూముల్లో కొందరు సాగు పనులు చేయడాన్ని రఘుపతి తప్పుబట్టారు. అప్పట్లోనే రైతులకు పరిహారం ఇచ్చారని, ఈ విషయంలో గందరగోళం రేపేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక నిజాంపట్నం పోర్టుని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Read More:

చిన్నారిని దత్తత తీసుకున్న ‘సాహో’ నటి

శ్యామ్‌ సింగ రాయ్‌: 65 ఏళ్ల వృద్ధుడిగా నాని..!