రాందాస్‌ అథవాలేకు కరోనా.. నిన్న కేంద్రమంత్రి ప్రెస్‌మీట్‌కి హాజరైన పలువురు

కేంద్ర మంత్రి రాందాస్‌, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ)(RPI-A)ప్రెసిడెంట్‌ రాందాస్‌ అథవాలేకు కరోనా సోకింది.

  • Manju Sandulo
  • Publish Date - 3:24 pm, Tue, 27 October 20

Ramdas Athawale Corona: కేంద్ర మంత్రి రాందాస్‌, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ)(RPI-A)ప్రెసిడెంట్‌ రాందాస్‌ అథవాలేకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో వెల్లడించిన ఆయన.. తనతో కాంటాక్ట్ అయిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కాగా సోమవారం సినీ నటి పాయల్‌ ఘోస్‌.. అథవాలే సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెతో పాటు పలువురు కార్యకర్తలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో కొందరు మాస్క్‌లు పెట్టుకోకపోగా.. ఎవ్వరూ కనీస భౌతిక దూరం పాటించలేదు. ఇక అధవాలే, పాయల్‌ కొన్ని ఫొటోల్లో మాస్క్ గడ్డం కిందకు పెట్టుకొని కనిపించారు. కాగా కరోనా వచ్చిన కొత్తలో ముంబయిలో ‘గో కరోనా గో’ అంటూ రాందాస్ అథవాలే నినాదాలు చేయగా.. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Read More:

ఏపీలో కొత్త జిల్లాలపై జనవరి 26న స్పష్టమైన ప్రకటన: డిప్యూటీ స్పీకర్

చిన్నారిని దత్తత తీసుకున్న ‘సాహో’ నటి