ఇంత కంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా.. బాలికలకు చదువును దూరం చేసేందుకు.. ఏకంగా ఆ పని..
బాలికలు చదువుకుంటేనే ఏ దేశమైనా బాగుంటుంది. అభివృద్ధిలో స్త్రీ,పురుషుల అక్షరాస్యత రెండూ.. ముఖ్యమే. కానీ.. ఇరాన్ లో జరిగిన ఓ ఘటన మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. బాలికలు స్కూళ్లకు వెళ్లకూడదనే...
బాలికలు చదువుకుంటేనే ఏ దేశమైనా బాగుంటుంది. అభివృద్ధిలో స్త్రీ,పురుషుల అక్షరాస్యత రెండూ.. ముఖ్యమే. కానీ.. ఇరాన్ లో జరిగిన ఓ ఘటన మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. బాలికలు స్కూళ్లకు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఇరాన్ లోని కోమ్‌లో ఓ పాఠశాల విద్యార్థినులపై కొంతమంది విష ప్రయోగం జరిగింది. ఈ మేరకు ఇరాన్ డిప్యూటీ మంత్రి వెల్లడించారు. టెహ్రాన్‌కు దక్షిణంగా ఉన్న కోమ్‌లో కొన్ని రోజుల క్రితం పాఠశాలలోని వందలాది విద్యార్థినులపై విషప్రయోగం జరిగింది. దీంతో వారు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ హెల్త్ మినిస్టర్, యూనెస్ పనాహి వెల్లడించారు. ఈ ఘటన తర్వాత బాలికలను పాఠశాలలకు పంపడాన్ని ఆపేయాలని కోరారు.
అయితే.. ఇంత జరుగుతున్నా ఈ ఘటనలో ఏ ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు అధికారులను వివరణ కోరేందుకు నగర గవర్నరేట్ కు చేరుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని నిలదీశారు. ఈ ఘటనపై గత వారమే ప్రాసిక్యూటర్ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటాజెరి న్యాయ విచారణకు ఆదేశించారు.
ఇరాన్ లో హిజాబ్ ధరించినందుకు గాను 22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమ్నీని కస్టడీలో తీసుకోగా.. ఆమె డిసెంబర్ 16 న మరణించింది. ఈ సంఘటనపై నిరసనలు చల్లారకముందే విద్యార్థులపై విషప్రయోగం జరగడం సంచలనంగా మారింది. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడిన యువతి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..