Boat Accident: వలసదారుల పడవ బోల్తా.. 59 మంది జల సమాధి.. భారీగా పెరుగుతోన్న మృతుల సంఖ్య..
ఇటలీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. అయోనియన్ సముద్రంలో పడవ బోల్తా పడి 59 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విషయం..
ఇటలీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. అయోనియన్ సముద్రంలో పడవ బోల్తా పడి 59 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 100 మందికి పైగా వలసదారులు ఉన్నట్లు తెలిపారు. కోస్టు గార్డు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల్లో నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్టు గార్డ్, బార్డర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చెందిన నౌకలు సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. పడవపై వలస వచ్చిన వారు ఏ దేశస్థులో ఇంకా తెలియలేదు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన తర్వాత 80 మంది ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదంలో మరణాల సంఖ్య పెరగే అవకాశం ఉంది. ఐరోపాలో ముఖ్యంగా ఇటలీకి వలసలు పెరిగిపోతున్నాయి. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు వలసదారులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిని అరికట్టేందుకు గోడలు నిర్మించడం, నిఘా ఉంచడం, బ్రూట్ ఫోర్స్‌ని ఉపయోగించినా ఫలితం లేకుండా పోతోంది. కాలాబ్రియన్ తీరం ఇటీవలి వరకు తక్కువ వలస కార్యకలాపాలను చూసిన ప్రాంతం. కానీ గ్రీస్ నిబంధనలను కఠినం చేయడంతో వలసలు క్రమంగా పెరుగుతున్నాయి.
వలసవాదులు ప్రధానంగా అఫ్గానిస్థాన్ సిరియా నుంచి వస్తున్నారు. ఆదివారం మునిగిపోయిన ఓడలో సిరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారు, కాలాబ్రియన్ నగరమైన క్రోటోన్‌లోని ఒక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇలాంటి ఘటనలు సహజంగా జరుగుతున్నాయని, పొట్ట నింపుకునేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..