Video: ఎక్కడున్నా నచ్చిన వారిని ఈజీగా లిప్‌కిస్ పెట్టేయోచ్చు.. అందుబాటులోకి కిస్సింజర్.. వైరల్ వీడియో..

Remote kissing: మీరు మీ భాగస్వామిని మిస్ అవుతున్నారా? భాగస్వామి నుంచి దూరాన్ని తట్టుకోలేకపోతున్నారా? మీ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నట్లయితే, ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Video: ఎక్కడున్నా నచ్చిన వారిని ఈజీగా లిప్‌కిస్ పెట్టేయోచ్చు.. అందుబాటులోకి కిస్సింజర్.. వైరల్ వీడియో..
Kissing Remote
Follow us
Venkata Chari

|

Updated on: Feb 27, 2023 | 6:33 PM

మీరు మీ భాగస్వామిని మిస్ అవుతున్నారా? భాగస్వామి నుంచి దూరాన్ని తట్టుకోలేకపోతున్నారా? మీ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నట్లయితే, ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి వారికి చైనా ఓ శుభవార్త అందించింది. చైనాకు చెందిన చాంగ్‌జౌ యూనివర్సిటీ ఓ అద్భుతమైన ప్రయోగం చేసి ఓ రిమోట్‌ను తయారు చేసింది. అదే కిస్సింగ్ రోబోట్. అదేనండీ తెలుగులో ముద్దుల రోబోట్ అంట. కేవలం ముద్దుల కోసమే రిమోట్‌ను తయారు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. మీ భాగస్వామి మీకు దూరంగా ఉంటే, మీరు ఈ రిమోట్‌ని ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవచ్చంట. ఒక జంట సన్నిహితంగా ఉండటానికి ఈ సుదూర కిస్సింగ్ రోబోట్‌ను ఉపయోగించవచ్చు. ఈ కిస్సింగ్ రోబోట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ రిమోట్‌లో సిలికాన్ లిప్స్ ఉన్నాయి. ప్రెజర్ సెన్సార్లు ఇందులో అందించారు. దీనితో మీరు ముద్దు పెట్టిన ఫీల్‌ను అనుభవించవచ్చంట. చైనా రన్ గ్లోబల్ టైమ్స్ ప్రకారం, మీరు ఈ రిమోట్ పరికరాన్ని యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, మీరు మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ పోర్ట్‌కి కనెక్ట్ చేసుకుని, యాప్ ద్వారా భాగస్వామితో కనెక్ట్ కావచ్చు. అప్పుడు మీరు ఈ రిమోట్ పరికరాన్ని ఉపయోగించి మీ భాగస్వామికి వీడియో కాల్ చేసి, ముద్దులు పెట్టవచ్చంట.

ఇవి కూడా చదవండి

ఈ రిమోట్ ముద్దును కనుగొన్న శాస్త్రవేత్త జియాంగ్ జోంగ్లీ స్టేట్ రన్ గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, “నేను నా స్నేహితురాలితో చాలా దూరంలో ఉన్నాను. ఫోన్ ద్వారా మాత్రమే సన్నిహితంగా ఉన్నాను. ఇదే ఈ రిమోట్‌ను తయారు చేసేలా ప్రేరణనిచ్చింది. 2016లో మలేషియాలోని ఇమాజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఇలాంటి పరికరాన్ని విడుదల చేసింది.

కిస్సింజర్ అనే పరికరం టచ్-సెన్సిటివ్ సిలికాన్ ప్యాడ్‌లతో అమర్చారని CNN నివేదించింది. ఈ ముద్దుకు సంబంధించిన రిమోట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు వింత రియాక్షన్స్ కురిపిస్తున్నారు. ఇది చాలా ఫన్నీగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..