75 ఏళ్ల క్రితం విడిపోయి సోషల్ మీడియా ద్వారా కలుసుకున్న అక్కా తమ్ముడు

సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగమైపోయింది. దీన్ని వాడకుండా ఏ ఒక్కరు కూడా ఒక్క రోజు ఉండలేకపోతున్నారు. కొంతమందైతే గంటల తరబడి అందులోనే కాలక్షేపం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని ఉపయోగపడే విషయాలు కూడా జరుగుతాయి.

75 ఏళ్ల క్రితం విడిపోయి  సోషల్ మీడియా ద్వారా కలుసుకున్న అక్కా తమ్ముడు
Sister And Brother
Follow us
Aravind B

|

Updated on: May 23, 2023 | 4:10 AM

సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగమైపోయింది. దీన్ని వాడకుండా ఏ ఒక్కరు కూడా ఒక్క రోజు ఉండలేకపోతున్నారు. కొంతమందైతే గంటల తరబడి అందులోనే కాలక్షేపం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని ఉపయోగపడే విషయాలు కూడా జరుగుతాయి. తాజాగా 75 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముడు సోషల్ మీడియా వేదిక సహాయంతో ఒక్కటయ్యారు. అయితే స్వాతంత్ర్యం రాకముందు పంజాబ్‌లో సర్దార్ భదన్ అనే కుటుంబం ఉండేది. స్వాతంత్ర్యం వచ్చాక భారత్-పాక్ విభజన సమయంలో ఆయన కుమారుడు తమ కుటుంబం నుంచి తప్పిపోయి.. ప్రస్తుతం ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరుకున్నాడు. కానీ సర్దార్ కుటుంబం మాత్రం భారత్‌లోనే ఉండిపోయింది. ఆయన కుమారుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనే స్థిరపడి చిన్నవయసులే పెళ్లి చేసుకున్నాడు.

ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే, వీరు విడిపోయిన విషయాన్ని తెలియజేస్తూ సర్దార్‌ కుమారుడి పిల్లలు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. సర్దార్‌ కుమార్తె కుటుంబం ఈ పోస్ట్‌‌ను గుర్తించింది. వాళ్లిద్దరు అక్కాతమ్ముడని, తాము సర్దార్‌ కుటుంబసభ్యులనే నిర్దారణకు వచ్చారు. 75 ఏళ్ల క్రితం విడిపోయిన ఈ రెండు కుటుంబాలు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న కర్తార్‌పూర్‌ కారిడార్‌లో కలుసుకున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల వయసులో తిరిగి చూసుకున్న అక్కాతమ్ముడి ఆనందంలో మునిగిపోయారు. అనంతరం గురుద్వారాను సందర్శించారు. ఈ రెండు కుటుంబాలు ఏకం కావడాన్ని చూసిన కర్తార్‌పూర్‌ కారిడార్ అధికారులు.. వారికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆ రెండు కుటుంబాలు కూడా బహుమతులు కూడా అందజేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..