AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దారుణం.. 91 శాతం శిశువుల మరణాలు అలాంటి దేశాల్లోనే జరుగుతున్నాయి

కొంతమంది పిల్లలు నెలలు నిండకుండా పుట్టి చనిపోతారు. అయితే ఇలాంటి మరణాలు 91 శాతం అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ల నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం వాయుకాలుష్యమేనని పేర్కొంది.

అయ్యో దారుణం.. 91 శాతం శిశువుల మరణాలు అలాంటి దేశాల్లోనే జరుగుతున్నాయి
Baby
Aravind B
|

Updated on: May 23, 2023 | 4:05 AM

Share

కొంతమంది పిల్లలు నెలలు నిండకుండా పుట్టి చనిపోతారు. అయితే ఇలాంటి మరణాలు 91 శాతం అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ల నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం వాయుకాలుష్యమేనని పేర్కొంది. వాతావరణ మార్పులు, శిశువల ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని ఈ నివేదిక తెలియజేసింది. శిశువుల జననాలు, వారి ఆరోగ్యంపై వేడిగాలులు, వరదలు, కరవులు, తుపానులు, కార్చిచ్చులు, వాయుకాలుష్యం మొదలైన వాటి వల్ల వాతావరణ మార్పులు ప్రభావం చూపుతాయని తెలిపింది. అయితే ఈ పరిస్థితిని మార్చాలంటే ఆర్థిక వనరుల అవసరం చాలానే ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.

బరువు తక్కువున్న శిశువుల్లో 15.6 శాతం మరణాలు, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో 35.7 శాతం మరణాలకు ఇళ్లల్లో పెరుగుతున్న వాయుకాలుష్యమేనని పేర్కొంది. గాంబియాలో జరిపిన పరిశోధన ప్రకారం.. ప్రతి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరగడంతో పిండంపై 17 శాతం అధికంగా ఒత్తిడి పడుతోందని తెలిపింది. భారత్‌లో కూడా పర్యావరణ మార్పుల బారిన పడుతున్న జిల్లాల్లో బాలింతలు, శిశువుల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటోందని వెల్లడించింది. అయితే పర్యావరణ మార్పులు అనేవి బాలింతలు, శిశువులపై దుష్పరిణామాలను చూపిస్తున్నాయని.. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు వెంటనే మహిళలు, సామాజిక సంస్థలతో చర్చలు ప్రారంభించాలని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డాక్టర్‌ అన్షు బెనర్జీ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!