AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudan Crisis: సూడన్ ప్రజలకు ఊరట.. యుద్ధ విరమణ ప్రకటించిన ఇరుపక్షాలు

సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అల్లర్లలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒప్పందం జరగడం చర్చనీయాంశమైంది. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక దాడులు నిర్వహించింది.

Sudan Crisis: సూడన్ ప్రజలకు ఊరట.. యుద్ధ విరమణ ప్రకటించిన ఇరుపక్షాలు
Sudan
Aravind B
|

Updated on: May 23, 2023 | 4:25 AM

Share

సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అల్లర్లలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒప్పందం జరగడం చర్చనీయాంశమైంది. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల పాటు కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపైచేయి సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. అయితే ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం 7: 45 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు అంగీకరించాయి.

కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో వీరి మధ్య చర్చలు జరిగన తర్వాత ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. అయితే ఈ ఒప్పందం పొరుగు దేశాలకు పారిపోయిన 2,50,000 మందితో పాటు దాదాపు 11 లక్షల ప్రజలకు ఊరట కల్పించింది.ఇదిలా ఉండగా సెంట్రల్ ఖార్టూమ్‌లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన RSFని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..