AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scientists Warning: హిమానీ నదాలపై బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా హెచ్చరిక.. అదే జరిగితే మానవాళికి ముప్పే!

Scientists Warning on Sea level increase:  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవాళికి ముప్పును తేబోతున్న సంకేతాలు ఉత్తర, దక్షిణ ధృవాలలో తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా పెరుగుతున్న భూతాపంతో అంటార్కిటికా (Antarctica)లోని మంచు ఫలకాలకు ముప్పు ఏర్పడుతోందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు (Britain Scientists) వార్నింగ్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇండస్ట్రియలైజేషన్ (Industrialization)‌కు పూర్వమున్న పరిస్థితితో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితి ప్రమాదకరంగా వుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికీకరణకు పూర్వపు ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. సరాసరి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల […]

Scientists Warning: హిమానీ నదాలపై బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా హెచ్చరిక.. అదే జరిగితే మానవాళికి ముప్పే!
Sea
Rajesh Sharma
|

Updated on: Apr 10, 2021 | 7:15 PM

Share

Scientists Warning on Sea level increase:  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవాళికి ముప్పును తేబోతున్న సంకేతాలు ఉత్తర, దక్షిణ ధృవాలలో తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా పెరుగుతున్న భూతాపంతో అంటార్కిటికా (Antarctica)లోని మంచు ఫలకాలకు ముప్పు ఏర్పడుతోందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు (Britain Scientists) వార్నింగ్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇండస్ట్రియలైజేషన్ (Industrialization)‌కు పూర్వమున్న పరిస్థితితో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితి ప్రమాదకరంగా వుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికీకరణకు పూర్వపు ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. సరాసరి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే.. అంటార్కిటికాలోను హిమఫలకాల్లో మూడో వంతుకుపైగా సముద్రంలో కుప్పకూలుతాయని ఫలితంగా సముద్ర మట్టాల్లో పెరుగుదల వేగాన్ని పుంజుకుంటుందని వారు హెచ్చరించారు.

మంచు ఫలకాలు.. సముద్రంలో శాశ్వతంగా తేలియాడే వేదికలు. అవి తీర ప్రాంతాల వెంబడి ఉంటాయి. నేలపై ఉన్న హిమానీనదాల నుంచి నీరు సాగరంలోకి చేరినప్పుడు అవి ఏర్పడుతుంటాయి. అయితే ఆ నీరు అపరిమితంగా సాగరంలోకి వచ్చి చేరి, సముద్ర మట్టాలను అమాంతం పెంచేయకుండా చూడటంలో ఈ మంచు ఫలకాలు చాలా కీలకం. బ్రిటన్‌లోని రీడింగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు సాగించారు. భూతాపం 4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే.. అంటార్కిటికాలోని మొత్తం మంచు ఫలకాల విస్తీర్ణంలో 34 శాతానికి ముప్పు ఏర్పడవచ్చాని వారు అంఛనా వేస్తున్నారు. అంటార్కిటికా ద్వీపకల్పంలోని అతిపెద్ద హిమ ఫలకం ‘లార్సన్‌ సి’కి ఎక్కువ ముప్పు పొంచి ఉందని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త గిల్బర్ట్‌ వెల్లడించారు.

‘‘ఆ మంచు కుప్పకూలడం.. ఒక సీసాకు అమర్చిన భారీ మూతను అమాంతంగా తెరవడం లాంటిదే. దీనివల్ల హిమానీదాల నుంచి భారీ పరిమాణంలో నీరు సాగరాల్లోకి వచ్చి చేరుతుంది’’ అని వివరించారు. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం చేస్తే.. తరగిపోయే మంచు ఫలకాల విస్తీర్ణాన్ని సగానికి తగ్గించొచ్చని చెప్పారు. దీనివల్ల సముద్రమట్టం గణనీయంగా పెరగకుండా చూడొచ్చని పేర్కొన్నారు. కరిగిన మంచు.. హిమఫలకాల ఉపరితలంపై పేరుకుపోతున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆ ఫలకంలో పగుళ్లు ఏర్పడి, సముద్రంలో కుప్పకూలే అవకాశం ఉందన్నారు. వీటిపై గతంలో నిర్వహించిన అధ్యయనాలు.. మంచు తరుగుదలకు సంబంధించిన ఒక స్థూల చిత్రాన్ని మాత్రమే ఆవిష్కరించాయని చెప్పారు. తాము మాత్రం అధునాతన హై రిజల్యూషన్‌ ప్రాంతీయ వాతావరణ నమూనాలను ఉపయోగించి, సవివర దృశ్యాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు.

ALSO READ: ఆ విషాద ఘటనకు త్వరలో 109 ఏళ్ళు.. ఆ ఓడతో గుంటూరు జిల్లాకు లింకు? ఏంటో అది?

ALSO READ: తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మావోయిస్టు టెన్షన్.. తెలంగాణలో పోలీసులు అలర్ట్.. ఏజెన్సీలోను అంతే