Mosque Loud Speaker: సౌదీ అరేబియా సర్కార్ సంచలన నిర్ణయం.. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు
మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సౌదీ అరేబియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల వాల్యూమ్‌లో మూడో వంతు మాత్రమే సెట్ చేయాలని ఆదేశించింది.
Saudi Mosque Loud Speaker Restriction: మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సౌదీ అరేబియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ‘కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం అజాన్ కోసం ఈ లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని మసీదుల్లో నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల వాల్యూమ్‌లో మూడో వంతు మాత్రమే సెట్ చేయాలని సౌదీ అరేబియా దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశించింది. దేశంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రతిస్పందనగా తాము మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో సౌండ్ తగ్గించాలని ఆదేశించినట్లు సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా లతీఫ్ అల్ షేక్ చెప్పారు.
లౌడ్ స్పీకర్లు తమ పిల్లల నిద్రకు భంగం కలిగిస్తున్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులు ఉన్నాయని మంత్రి షేక్ చెప్పారు.స్టేట్ టెలివిజన్ చూపించిన వీడియోలో మంత్రి మాట్లాడుతూ, ప్రార్థన చేయాలనుకునే వారు ప్రార్థనకు ఇమామ్ పిలుపు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని మంత్రి షేక్ అన్నారు. దేశంలోని రెస్టారెంట్లు, కేఫ్‌లలో కూడా బిగ్గరగా సంగీతం పెట్టకుండా నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాను ఉదారంగా మార్చడానికి, ప్రజా జీవితంలో మతం పోషిస్తున్న పాత్రను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Also…. Mobile ICU Buses: కోవిడ్ బాధితులకు అందుబాటులో మెడికల్ యూనిట్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్