Mobile ICU Buses: కోవిడ్ బాధితులకు అందుబాటులో మెడికల్‌ యూనిట్‌ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మొబైల్‌ ఐసీయూ బస్సులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించారు.

Mobile ICU Buses: కోవిడ్ బాధితులకు అందుబాటులో మెడికల్‌ యూనిట్‌ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister Ktr Inaugurated Mobile Icu Buses
Follow us

|

Updated on: Jun 03, 2021 | 5:04 PM

Mobile ICU Buses in Telangana: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు.. ఆసుపత్రికి చేరకుండానే ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇటు కోవిడ్ బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇదే క్రమంలో బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్‌ ఐసీయూ బస్సులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్‌ మొబైల్‌ బస్సులను అందించిన లార్డ్స్‌ చర్చికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ న్నారు. తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. కోవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు.

మెడికల్‌ యూనిట్‌ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు.

Read Also….  AP Electric Two-Wheelers: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. వాయిదా పద్దతిలో ఎలక్ట్రిక్ వాహనాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు!