TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

TS EAMCET 2021 application date: కరోనావైరస్ సెకండ్ వేవ్ అంతటా విజృంభిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలతో

TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
Ts Eamcet
Shaik Madarsaheb

|

Jun 03, 2021 | 4:35 PM

TS EAMCET 2021 application date: కరోనావైరస్ సెకండ్ వేవ్ అంతటా విజృంభిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలతో పాటు పలు సెట్‌లను వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఎంసెట్ 2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని ఎంసెట్ క‌న్వీన‌ర్ గురువారం వెల్ల‌డించారు. విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించినట్లు కన్వీనర్ వెల్లడించారు. కాగా తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జెఎన్‌టీయూ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా.. 26 వరకు పొడిగించారు. అనంతరం మే 26 నుంచి జూన్ 3 వరకు పొడిగించారు. అయితే.. మరలా వస్తున్న వినతి మేరకు జూన్ 10 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌ ఆధారంగా జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నటల్లు అధికారులు అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read:

Covid-19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వద్దంటే వద్దు..! అధికారులను చూసి బామ్మ ఏం చేసిందో తెలుసా..?

Teachers Eligibility Test: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్… టెట్ సర్టిఫికెట్ గడువు పెంపు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu