Teachers Eligibility Test: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్… టెట్ సర్టిఫికెట్ గడువు పెంపు..
TET Certificate Validity: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ ( Teacher Eligibility Test) సర్టిఫికెట్ గడువును ఏడేళ్ల నుంచి
TET Certificate Validity: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ ( Teacher Eligibility Test) సర్టిఫికెట్ గడువును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం ప్రకటన చేశారు. ఏడేళ్ల కాలపరిమితి ముగిసిన వారికి మళ్లీ సర్టిఫికెటు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసింది. దీని ప్రకారం.. 2011 నుంచి టెట్ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు జీవితకాలం అర్హత వర్తించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా టెట్ గడువును జీవిత కాలానికి పెంచడంతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) క్వాలిఫై కావడం తప్పనిసరి. దీంతోపాటు వ్యాలిడిటీని కూడా చూస్తారు. టెట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, కేంద్రం (CTET) కూడా వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఈ టెట్ సర్టిఫికెట్ వేలిడిటీ ఏడేళ్లు అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE 2011లో మార్గదర్శకాలను విడుదల చేసింది.
Validity period of Teachers Eligibility Test (TET) qualifying certificate has been extended from 7 years to lifetime with retrospective effect from 2011. https://t.co/8IQD3cwRTz (1/2) pic.twitter.com/EGi5IJ2wNu
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 3, 2021
Also Read: