Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చేసింది తప్పే.. ఫ్యాబీఫ్లూ మందులను అనధికారికంగా నిల్వ చేసి ఇచ్చారు.. హైకోర్టుకు నివేదిక..

Fabiflu Drug - Delhi High Court: తూర్పు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్.. ఫ్యాబీఫ్లూ అనే ఔషధాలను కరోనా బాధితులకు ఉచితంగా అంద‌జేసిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇటీవల రాజకీయ దుమారానికి తెరతీసింది. కరోనా మందులు

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చేసింది తప్పే.. ఫ్యాబీఫ్లూ మందులను అనధికారికంగా నిల్వ చేసి ఇచ్చారు.. హైకోర్టుకు నివేదిక..
Gautam Gambhir
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 03, 2021 | 2:56 PM

Fabiflu Drug – Delhi High Court: తూర్పు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్.. ఫ్యాబీఫ్లూ అనే ఔషధాలను కరోనా బాధితులకు ఉచితంగా అంద‌జేసిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇటీవల రాజకీయ దుమారానికి తెరతీసింది. కరోనా మందులు దొరకని సమయంలో గంభీర్‌కు ఎలా ఫాబీఫ్లూ డ్రగ్స్ లభించాయంటూ విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. దీంతోపాటు గంభీర్‌పై వ్య‌తిరేకంగా కోర్టులో పిల్ కూడా దాఖ‌లైంది. దీనిపై కోర్టులో ఇప్పటికే పలుమార్లు విచారణ కూడా జరిగింది. డ్రగ్స్ నిల్వ చేసేందుకు పర్మిషన్ ఎలా లభించిందని, ఎక్కడి నుంచి ఫాబీఫ్లూ డ్రగ్స్ వచ్చాయో సమగ్రంగా తెలియజేయాలని కోర్టు అధికారులను, డ్రగ్ కంట్రోలర్ బాడీని ఆదేశించింది. అయితే.. దీనిపై ఢిల్లీ డ్రగ్ కంట్రోలర్ బాడీ గురువారం నివేదికను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. గౌతమ్ గంభీర్ గురువారం అనధికారికంగా ఫాబీఫ్లూ మందును నిల్వ చేసి, కోవిడ్ -19 రోగులకు ఇచ్చారని తేలిందని ఢిల్లీ డ్రగ్ కంట్రోలర్ బాడీ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. డ్రగ్ కంట్రోలర్ తరఫున హాజరైన న్యాయవాది నందితారావు మాట్లాడుతూ.. క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ బృందం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ కింద నేరానికి పాల్పడిందని వెల్లడించారు.

గంభీర్ లాగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కూడా డ్రగ్స్‌ను పంపిణీ చేశారు. ఆయన కూడా దోషిగా తేలినట్లు అధికారులు తెలిపారు. అయితే.. డ్రగ్ కంట్రోలర్ సమర్పించిన రిపోర్ట్ గంభీర్‌కు మాత్రమే సంబంధించినదా.? లేదా ప్రవీణ్‌కుమార్‌‌కు సంబంధం ఉందా? అని కోర్టు న్యాయవాదిని ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్ట్‌లో ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కూడా దోషిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని, చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం ఢిల్లీ కంట్రోలర్ బాడీని సూచించింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 29న వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. కరోనా అత్యవసర చికిత్సకు ఉపయోగించే మందుల కొరత ఉండటంతో.. గంభీర్ తన నియోజకవర్గ ప్రజలు తన కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలని ప్రకటన విడుదల చేశారు. మందులు కొరత ఉన్న సమయంలో ఆయనకు ఎలా దొరకాయంటూ దీపక్ కుమార్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యంను దాఖలు చేశారు.

Also Read:

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి సిలిండర్ డెలివరీ చెయ్యాలంటే.! ఆ కోడ్ తప్పనిసరి..

Jagananna colonies : ఇళ్లు లేని వారు ఎక్కడా ఉండకూడదు.. పండగ వాతావరణంలో నిర్మాణాలకు పునాదులు వేస్తున్నాం : జగన్