కోవిద్ పై పోరులో ఇదో కొత్త పంథా ! వ్యాక్సిన్ తీసుకుంటే బహుమతులు….తమిళనాడులో ఓ యువకుడే ఆదర్శం

తమిళనాడులోని కొన్ని జిల్లాల గ్రామాల్లో కోవిద్ వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది గ్రామీణులు విముఖత చూపుతున్నారు. టీకామందులు తీసుకుంటే జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఇతర రుగ్మతజలు వస్తాయని ప్రచారం జరగడంతో ఎంతోమంది వ్యాక్సిన్ అంటేనే దూరంగా పారి[పోతున్నారు.

కోవిద్ పై పోరులో ఇదో కొత్త పంథా ! వ్యాక్సిన్ తీసుకుంటే బహుమతులు....తమిళనాడులో ఓ యువకుడే ఆదర్శం
Tamilnadu Youths Fight Against Covid 19 Gifts To Villagers Who Get Vaccinated
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 03, 2021 | 2:58 PM

తమిళనాడులోని కొన్ని జిల్లాల గ్రామాల్లో కోవిద్ వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది గ్రామీణులు విముఖత చూపుతున్నారు. టీకామందులు తీసుకుంటే జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఇతర రుగ్మతజలు వస్తాయని ప్రచారం జరగడంతో ఎంతోమంది వ్యాక్సిన్ అంటేనే దూరంగా పారి[పోతున్నారు. ఉదాహరణకు కళ్లకురిచ్చి జిల్లాలోని ఉలుండుర్ పేట్, కుమథూర్ తదితర గ్రామాలవాసులైతే కోవిద్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ససేమిరా నిరాకరిస్తూ వచ్చారు. వీరిలో కనీస అవగాహన లేకపోవడాన్ని ఆర్.తంబిదురై అనే సోషల్ యాక్టివిస్ట్ గమనించాడు. వారిలో ఈ భయాలను పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా మొదట తన కుమథుర్ గగ్రామీణులను చైతన్యవంతులను చేయాలనుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి తన సొంత జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టి వారికి బహుమతులుగా ఇవ్వాలని భావించాడు. ఈ వస్తువుల్లో రకరకాల గృహోపకరణాలను చేర్చాడు. మీరు వ్యాక్సిన్ తీసుకుంటే ఈ గిఫ్ట్ మీకే అంటూ స్టూడియో ఫోటోగ్రాఫర్ కూడా అయిన తంబిదురై ప్రచారం చేశాడు. మొదట్లో ఇతని క్యాంపునకు తక్కువమంది వచ్చినప్పటికీ..ఉచితంగా చక్కని బహుమతులు వస్తుంటే అంతా టీకామందులు తీసుకుని మరీ ఇతని స్టూడియో ముందు క్యూలు కట్టడం ప్రారంభించారు. మొదటి రోజున అతి కొద్దిమంది రాగా రెండో రోజుకే అది 94 మందికి చేరింది. స్థానికులకు ఇప్పుడు వ్యాక్సిన్ అంటే భయం లేకపోగా చేతికి బహుమతులు కూడా వస్తున్నాయి.

చాలామంది డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు తంబిదురై కృషిని, అతని ఐడియాను ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల యువకులు గ్రామీణులను చైతన్యవంతులను చేసేందుకు యత్నిస్తున్నారు. పంజాబ్ లో ఆ రాష్ట్ర సీఎం అమరేందర్ సింగ్ రూరల్ కరోనా వాలంటీర్స్ పేరిట యువజన బృందాలను నియమించారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : చూస్తుండగానే కుప్పకూలిన హైవే రోడ్డు..కొత్త రోడ్డు ఇలా జరిగితే ఎలా అని నెటిజన్లు కామెంట్స్ : Viral Video.

 ఆకలికి బ్రెడ్ తింటూ ఊపిరాడక చనిపోయిన చిన్నారి.గొలుసులతో బంధించిన ఆరేళ్ళ చిన్నారి.కన్నీళ్లు పెట్టించే వీడియో : Viral Video

త్రిష, రకుల్‌పై బాలయ్య అభిమానులు ఫైర్‌..ఇండ్రస్ట్రీ లో చక్కర్లు కొట్టిన రెండు న్యూస్ లకు చెక్ : Balakrishna video

కలర్ ఫుల్ లెమర్స్ బలే డాన్స్ చేస్తున్నాయ్.యూరప్ లోని చెస్టర్ జూ లో అరుదైన లెమర్స్ : Viral Video