Variety Mango Tree: ఉద్యోగం వదిలి.. మామిడితోటల పెంపకం.. ఏడాదికి రూ 50 లక్షల ఆదాయం..

Variety Mango Tree: చదువుకు చేసే వృత్తికి సంబంధం లేదని.. ఎంచుకున్న వృత్తిపై ఇష్టం గౌరవం శ్రద్ధ ఉంటె.. సక్సెస్ అందుకోవచ్చని నిరూపించాడో మెకానిక్...

Variety Mango Tree: ఉద్యోగం వదిలి.. మామిడితోటల పెంపకం.. ఏడాదికి రూ 50 లక్షల ఆదాయం..
Mango Farmer
Follow us

|

Updated on: Jun 03, 2021 | 8:06 PM

Variety Mango Tree: చదువుకు చేసే వృత్తికి సంబంధం లేదని.. ఎంచుకున్న వృత్తిపై ఇష్టం గౌరవం శ్రద్ధ ఉంటె.. సక్సెస్ అందుకోవచ్చని నిరూపించాడో మెకానిక్. చేస్తున్న ఉద్యోగాన్ని వాడిని వ్యవసాయంలో అడుగు పెట్టాడు. మామిడి మొక్కలను పెంచుతూ.. ఈరోజు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా అంట్రాల్ గ్రామంలో సావంత్ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ కుటుంబానికి 20 ఎకరాల భూమి ఉంది. అయితే వ్యవసాయం చేయాలంటే వర్షం పై ఆధారపడాల్సి ఉంది. ఈ గ్రామంలో 280 కు పైగా కుటుంబాలునివసిస్తున్నాయి. ఈ గ్రామస్థుల వ్యవసాయ కార్యకలాపాలు ప్రకృతి యొక్క దయమీద ఆధారపడి ఉంది. ఇక్కడి రైతులు ద్రాక్ష లేదా దానిమ్మ పండ్ల తోటలతో పాటు. బజ్రా (పెర్ల్ మిల్లెట్), మొక్కజొన్న, జోవర్ (జొన్న), గోధుమ మరియు పప్పుధాన్యాలను పండిస్తారు.

సావంత్ సాంగ్లీలోని ఒక సాంకేతిక సంస్థలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. అతనిని బదిలీ చేసినప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసి.. సొంత ఊరు చేరుకున్నాడు.వ్యవసాయ భూములను చూసుకోవాలని నిర్ణయించున్నాని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా కలిగి ఉన్న ఆటోమొబైల్ మెకానిక్ సావంత్ చెప్పాడు. అలా 2010 లో సావంత్ మామిడి తోట పెపంకం మొదలు పెట్టాడు. ఐదేళ్ల తరువాత, నర్సరీని ప్రారంభించాడు. ప్రస్తుతం, సావంత్ 15 మంది కుటుంబ సభ్యులు బనాలిలో నివసిస్తున్నారు. 20 ఎకరాల భూమిలో మామిడి తోటలకు 10 ఎకరాలు, మిగిలిన 10 ఎకరాల స్థలంలో చికూలు , దానిమ్మ, కస్టర్డ్ ఆపిల్, గువా, చింతపండు, ఇతర చెట్లను పెంచుతున్నారు.

సావంత్ నర్సరీ ఒక ఎకరంలో విస్తరించి ఉంది, ప్రతి సంవత్సరం అతను ఎకరానికి 2 టన్నుల మామిడి పంటలను పండిస్తాడు, మొత్తం 20 టన్నుల మామిడి పంటను పండిస్తూ.. నీటి కొరత ఉన్న ప్రాంతంలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచాడు. కేవలం ఆటోమొబైల్ మెకానిక్ అయిన సావంత్ ఒక ‘అగ్రి-ప్రెనియర్’ గా మారి, తన పొలం మరియు నర్సరీలో 25 మందికి ఉద్యోగం ఇచ్చాడు. నర్సరీలో జూన్ నుండి ఆగస్టు వరకు అంటు వేసిన మొక్కలను తయారు చేస్తారు. ఒక మొక్కకు రూ .40 నుంచి రూ .70 మధ్య ధర నిర్ణయించిన సావంత్ సంవత్సరానికి 2 లక్షల మామిడి మొక్కలను, అదనంగా 1 లక్షల కస్టర్డ్ ఆపిల్, జామున్, అత్తి, చికూ , గువా, చింతపండు మరియు నిమ్మకాయ మొక్కలను విక్రయిస్తాడు .

సావంత్ నర్సరీని స్థాపించడానికి, ప్యాక్ హౌస్ నిర్మించడానికి, మామిడి తోటను ఏర్పాటు చేయడానికి ఇలా తాను ఎదగడానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రాయితీలు , ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకున్నాడు. సావంత్ నర్సరీ నుండి పర్భాని, బీడ్, ఉస్మానాబాద్, బుల్ధానా, కొల్హాపూర్, బీజాపూర్, అథాని, బెల్గాం, ఇండి మరియు కొంకణ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలోని రైతులు తీసుకుని వెళ్తారు. కరోనా సమయంలో కూడా ఈ ఏడాది తాను బుల్ధానా నుండి 4 లక్షల మొక్కల కోసం ఆర్డర్ అందుకున్నానని చెప్పాడు.

మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉదన్ పండిట్’ బిరుదు ను అందుకున్నాడు సావంత్. దూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులు సావంత్ వ్యవసాయ క్షేత్రాన్నిసందర్శిస్తారు. ఎప్పుడూ కొత్త మామిడి రకాలను వెతుకుతూనే, సావంత్ ఇప్పటికే ఒకే మామిడి చెట్టుకు 22 రకాల మామిడి కాయలు కాసే చెట్టుని తన పొలంలో పెంచుతున్నాడు. అంతేకాదు.. త్వరలో ఒకే మామిడి చెట్టుకు 100 రకాల కాయలు కాసే విధంగా అంటుకడతానని ధీమా చెబుతున్నాడు సావంత్.

Also Read: .పుట్టింటికి వెళ్తానని చెప్పి భర్తకు షాక్ ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న భార్య…. ఆరాతీస్తే మరో 19మందిని వివాహం చేసుకుందని..

Latest Articles
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
'ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ' కూతురిని కత్తితోపొడిచిన తల్లి
'ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ' కూతురిని కత్తితోపొడిచిన తల్లి
తారక్‌కు రామ్ ఏమవుతాడో తెలుసా..
తారక్‌కు రామ్ ఏమవుతాడో తెలుసా..
సంపద సృష్టికి SIP ఒక సరైన పద్దతి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
సంపద సృష్టికి SIP ఒక సరైన పద్దతి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
తెలుగులోకి ప్రేమలు బ్యూటీ.. ఆ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిందా.?
తెలుగులోకి ప్రేమలు బ్యూటీ.. ఆ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిందా.?
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్