Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిద్ ఎఫెక్ట్ ఉన్నా.. యథాతథంగా టోక్యో ఒలంపిక్స్ పోటీలు…హండ్రెడ్ పర్సెంట్ ఖాయమన్న చీఫ్ ఆర్గనైజర్

దేశంలో కోవిద్ వేవ్ ఉన్నప్పటికీ టోక్యో ఒలంపిక్స్ యధాతథంగా జరుగుతాయని చీఫ్ ఆర్గనైజర్ సీకో హషిమొటో ప్రకటించారు. ఈ తరుణంలో వీటిని నిర్వహిస్తారా అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయని, ఏమైనా ..

కోవిద్ ఎఫెక్ట్ ఉన్నా.. యథాతథంగా టోక్యో ఒలంపిక్స్ పోటీలు...హండ్రెడ్ పర్సెంట్ ఖాయమన్న చీఫ్ ఆర్గనైజర్
Tokyo Olympics Chief
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 03, 2021 | 5:48 PM

దేశంలో కోవిద్ వేవ్ ఉన్నప్పటికీ టోక్యో ఒలంపిక్స్ యధాతథంగా జరుగుతాయని చీఫ్ ఆర్గనైజర్ సీకో హషిమొటో ప్రకటించారు. ఈ తరుణంలో వీటిని నిర్వహిస్తారా అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయని, ఏమైనా ..హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తామని ఆమె చెప్పారు. 50 రోజులు ముందుగానే చెబుతున్నా.. వీటి నిర్వహణలో మార్పు లేదు అన్నారు. ఒకవేళ ఈ పోటీలు జరుగుతుండగా కోవిద్ ఔట్ బ్రేక్ ప్రబలమైన పక్షంలో అభిమానులకు ప్రవేశం ఉండదని..వారు తమ ఇళ్లలోనే వీటిని చూడాల్సి ఉంటుందని ఆమె వివరించారు. బీబీసీ స్పోర్ట్స్ తో మాట్లాడిన ఆమె.. అసలు అభిమానుల ఒత్తిడిని ఎలా తట్టుకుంటామన్నదే పెద్ద సమస్య..సవాల్ కూడా అన్నారు. కోవిద్ పరిస్థితి తీవ్రమైతే అభిమానులు లేకుండానే క్రీడల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో జూన్ 20 తో ఎమర్జెన్సీ ముగుస్తుందని, అనంతరం దేశీయ ఫాన్స్ ని అనుమతించాలా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. విదేశీ ఫాన్స్ రాకపై ఇప్పటికే బ్యాన్ ఉందన్నారు. జులై 23 నుంచి టోక్యో ఒలంపిక్స్ జరుగుతాయా అన్న అనిశ్చితి ఉన్నప్పటికీ వివిధ స్టేడియంలను ప్లాస్టిక్ తో రీ-సైక్లింగ్ చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. పైగా గోల్డ్ మెడలిస్టులకు విక్టరీ మ్యూజిక్ ని కూడా రెడీ చేసి రిలీజ్ చేశారు. అథ్లెట్ల కాళ్ళ చప్పుడు టోక్యో దిశగా కదులుతున్నట్టు నేను ఫీలవుతున్నాను అని సీకో చమత్కరించారు.

ఏది ఏమైనా తాము పూర్తి సంసిద్ధతత్థో ఉన్నామని వెల్లడించారు. జపాన్ లో కోవిద్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 13 వేలమంది కోవిద్ రోగులు మృతి చెందారు. ఈ పరిస్థితుల్లో టోక్యో ఒలంపిక్స్ ను వాయిదా వేయాలని పలువురు వైద్య నిపుణులు, డాక్టర్లు కోరుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Sarkaru Vari Pata: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ‘సర్కారు వారి పాట’ షూట్ మొదలయ్యేది అప్పుడే..

Covaxin Trials: చిన్నారులపై కోవాక్సిన్‌ ట్ర‌య‌ల్స్‌.. పాట్నా ఎయిమ్స్‌లో ప్రయోగాలు..