Sarkaru Vari Pata: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ‘సర్కారు వారి పాట’ షూట్ మొదలయ్యేది అప్పుడే..

Mahesh Babu: దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం గురించి తెలిసిన విషయమే. ఈ వైరస్ సినీ ఇండస్ట్రీపై ఎక్కువగానే

Sarkaru Vari Pata: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. 'సర్కారు వారి పాట' షూట్ మొదలయ్యేది అప్పుడే..
Sarkaru Vari Pata
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2021 | 5:38 PM

Mahesh Babu: దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం గురించి తెలిసిన విషయమే. ఈ వైరస్ సినీ ఇండస్ట్రీపై ఎక్కువగానే ప్రభావం చూపించింది. చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతుండడంతో సినిమా షూటింగ్స్ తాత్కలికంగా నిలిచిపోయాయి. అలాగే అటు థియేటర్లు సైతం మూతపడడంతో.. షూటింగ్స్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ వాయిదా వేసున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్స్ త్వరగా ప్రారంభించే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా మేకర్స్ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నట్లుగా టాక్. ఇదిలా ఉంటే.. సర్కారు వారి పాట మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ సినిమా సంక్రాంతి కాకుండా ఈ ఏడాది చివరిలోనే విడుదల చేసే ప్లాన్ లో మహేష్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాది కోసం ఆల్రెడీ మహేష్ త్రివిక్రమ్ సినిమాను లైన్ లో పెట్టేసాడు. అందుకే వీలైనంత త్వరగా సర్కారు పాట ఫినిష్ చేసేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే నెలలో అంటే జులై నుంచి షూటింగ్ ప్రారంభం చేయనున్నట్లు టాక్. ఈ సినిమాలో మహేష్ పూర్తిగా న్యూ లుక్ లో కనిపించనున్నాడు. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ సినిమా నుంచి అప్డేట్ రానుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ విషయంలో అభిమానులకి నిరాశే మిగిలింది. అయితే నెక్స్ట్ మహేష్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మరి జులైలో మూడో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందేమో చూడాలి. ఈ సినిమాను మైత్రి మేకర్స్ – 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి మహేష్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్.. త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… డైరెక్టర్ ఎవరంటే..

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!