Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్.. త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… డైరెక్టర్ ఎవరంటే..

Nithiin: యంగ్ హీరో నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్.. త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా... డైరెక్టర్ ఎవరంటే..
Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2021 | 4:29 PM

Nithiin: యంగ్ హీరో నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతగా హిట్ సాధించలేకపోయాయి. చాలా మంది హీరోలు 2020.. 2021 సంవత్సరాల్లో కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయారు. కానీ నితిన్ మాత్రం ఇప్పటికే మూడు సినిమాలు విడుదల చేశాడు. మేస్ట్రో సినిమా తో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంటే ఈ రెండేళ్లలో ఆయన నాలుగు సినిమాలు అన్నమాట. ఈ కరోనా కాలంలో నితిన్ జోరు అంతటితో ఆగలేదు. మరింతగా దూసుకు పోతున్నాడు. మేస్ట్రో విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో తదుపరి సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు.

ఇప్పటికే ఈయన పవర్ పేట సినిమాను చేయాల్సి ఉన్నా కూడా అది ఇప్పట్లో పట్టాలెక్కే దాఖలాలు కనిపించడం లేదు. పస్తుత పరిస్థితుల్లో ఆ భారీ బడ్జెట్ సినిమా చేయడం కంటే చిన్న బడ్జెట్ సినిమాలను స్పీడ్ గా చేయడం ఉత్తమం అనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. రచయితగా సక్సెస్ దక్కించుకున్న వంశీ దర్శకుడిగా మాత్రం నా పేరు సూర్య సినిమాతో నిరాశ పర్చాడు.అల్లు అర్జున్ తో భారీ అంచనాల నడుమ రూపొందిన నా పేరు సూర్య సినిమా ప్లాప్ అయ్యింది. దాంతో ఆయన దర్శకత్వంలో సినిమా అంటే హీరోలు కాస్త వెనుక ముందు ఆడారు. చివరకు నితిన్ ఆయన కు ఓకే చెప్పాడు. ఆ సినిమా షూటింగ్ కు సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. ఆగస్టులో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడట నితిన్..

Also Read: G.N. RangaRajan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

Sai Dharam Tej: మెగా హీరో సినిమాకు కరోనా కష్టాలు.. ఓటీటీ వైపు సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!