Mahesh Babu: మరో మల్టీస్టార్ కు సిద్దమవుతున్న మహేష్ బాబు.. ఈసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటించనున్న సూపర్ స్టార్..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.
Mahesh Babu:
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. సీనియర్ హీరోలు కుర్రహీరోలతో కలిసి పోటాపోటీగా నటిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే కనువిందు చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు స్టార్ డైరెక్ట్ చేసేది కూడా ఓ స్టార్ డైరెక్టర్ అని తెలుస్తుంది. ఇంతకు ఆ ముగ్గురు స్టార్లు ఎవరంటే.. తెలుగులో మహేష్ బాబుకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి మహేష్ ఎప్పుడు ముందుంటాడు.. ఇప్పటికే పలు ప్రయోగాత్మక సినిమాలతోపాటు మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేసాడు. సీనియర్ ,హీరో వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసాడు మహేష్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మహర్షి సినిమాలో హీరో అల్లరినరేష్ తో కలిసి నటించాడు. ఇప్పుడు సీనియర్ హీరో తో కలిసి నటించబోతున్నాడని తెలుస్తుంది.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ , మహేష్ బాబు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వీరిద్దరినీ కలపబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసిన మురుగదాస్.. తెలుగు ఆడియన్స్ కు కూడా సుపరిచితుడే. ఆయన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. అంతేకాదు.. మహేష్ తో ‘స్పైడర్’ చిత్రాన్నికూడా తెరకెక్కించాడు. ఇప్పుడ్డు ఈ మల్టీస్టారర్ కోసం స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని సమాచారం. మహేష్ ఈ మూవీలో సీబీఐ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని కమల్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తారని టాక్. మరి ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలిసియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి: