Russia Ukraine War: ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉక్రెయిన్‌కు ఉంది.. ఆయుధ, ఆర్ధికసాయం ప్రకటించిన అగ్రరాజ్యం..
ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉక్రెయిన్‌కు ఉంది. ఆయుధాలతో పాటు ఆర్ధికంగా ఉక్రెయిన్‌ను ఆదుకుంటామని నాటో సదస్సులో ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. యూరప్‌లో లక్షమంది సైనికులను దింపాలని అమెరికా..

ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉక్రెయిన్‌కు ఉంది. ఆయుధాలతో పాటు ఆర్ధికంగా ఉక్రెయిన్‌ను ఆదుకుంటామని నాటో(NATO) సదస్సులో ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. యూరప్‌లో లక్షమంది సైనికులను దింపాలని అమెరికా నిర్ణయించింది. తమను రెచ్చగొడితే అణుయుద్ధం తప్పదని రష్యా కౌంటర్ ఇచ్చింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నాటో కూటమి దేశాల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు రంగం లోకి దిగింది నాటో. ఉక్రెయిన్ చుట్టుపక్కల నాలుగు బెటాలియన్లను మొహరించాలని నిర్ణయించారు. యూరప్ నాటో దళాల్లో లక్ష మంది సైనికులు అందుబాటులో ఉంటారు. ఉక్రెయిన్‌కు యాంటీ వార్ షిప్ మిస్సైళ్లను కూడా ఇవ్వాలని నిర్ణయంచారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ , బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ , ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్‌తో పాటు నాటో కూటమి నేతలు హాజరయ్యారు . ఆత్మరక్షణ ఉక్రెయిన్ హక్కు అని అన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఉక్రెయిన్ ఆత్మరక్షణ కోసం సైనికసాయం , ఆర్ధికసాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రష్యాపై మరిన్ని ఆర్ధిక ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రధాని జాన్సన్ కోరారు.
పుతిన్ ఉక్రెయిన్ విషయంలో రెడ్‌లైన్ దాటారని అన్నారు జాన్సన్. రష్యాపై నాటో కూటమికి ఫిర్యాదు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. రష్యా పౌరులపై ఫాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు , యుద్ధ విమానాలు , క్షిపణులు ఇవ్వాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను అడ్డుకుంటేనే యూరప్ అంతా సురక్షితంగా ఉంటుందన్నారు.
నాటో దేశాల తీరుపై రష్యా మండిపడింది. తమను రెచ్చగొడితే అణుయుద్ధం తప్పదని హెచ్చరించింది. రష్యాపై నాటో దేశాల వైఖరిని చైనా తీవ్రంగా ఖండించింది. రష్యాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు రష్యా నేవీ నౌకను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. కీవ్‌కు దూరంగా తమ బలగాలు వెళ్లిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని రష్యా రక్షణశాఖ తెలిపింది. కీవ్‌కు సమీపంలో తమ బలగాలు చెక్‌పాయింట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
నాటో సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం పోలాండ్ వెళ్తారు. ఉక్రెయిన్‌కు పొరుగు ఉన్న పోలండ్‌ను బైడెన్ సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిహద్దులో పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి: TS POLYCET 2022: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
చక్కని శరీర సౌస్ఠవం.. చూపు తిప్పుకోలేని అందం.. నడకలో రాజసం.. అయినా కష్టమొచ్చింది..