AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో 180 మంది కిరాయి సైనికులను చంపాం.. రష్యా కీలక ప్రకటన..

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో.. రష్యా సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు దఫాలుగా చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యా దాడులను ముమ్మరం చేసింది. తాజాగా యవోరివ్‌ మిలిటరీ బేస్‌పై

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో 180 మంది కిరాయి సైనికులను చంపాం.. రష్యా కీలక ప్రకటన..
Russia Ukraine Crisis
Shaik Madar Saheb
|

Updated on: Mar 14, 2022 | 7:13 AM

Share

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో.. రష్యా సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు దఫాలుగా చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యా దాడులను ముమ్మరం చేసింది. తాజాగా యవోరివ్‌ మిలిటరీ బేస్‌పై రష్యా మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 180 మంది కిరాయి సైనికులు చనిపోయారని పుతిన్‌ సైన్యం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ఉన్న అనుమానాస్పద విదేశీయులు, కిరాయి సైనికులను చంపుతూనే ఉంటామని రష్యా ప్రకటించింది. అంతకముందు రష్యన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ అమెరికన్ జర్నలిస్ట్‌ మృతిచెందాడు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో అమెరికా ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’కు చెందిన బ్రెంట్‌ రెనాడ్‌ అనే జర్నలిస్ట్‌ చనిపోయాడు. ఐడీ, పాస్‌పోర్టు సాయంతో ఆయనను గుర్తించారు. అయితే ఈ దాడిలో మరో జర్నలిస్ట్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు కీవ్‌ పోలీసులు ప్రకటించారు.

మరోవైపు చర్నోబిల్‌లో మళ్లీ పవర్‌ సప్లై మొదలుపెట్టింది ఉక్రెయిన్‌. ఇప్పటికే ఈ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటు రష్యా ఆధీనంలో ఉంది. ఆ సైనికుల కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నట్లు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఇక ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యురోపియన్‌ యూనియన్‌ అధ్యక్షుడితో మాట్లాడారు. ఈయూలో చేరతామని మరోసారి అడిగారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌కి ఆర్థికపరమైన సాయాన్ని అందించాలని కోరారు.

మరియుపోల్‌ మొత్తం నేలమట్టమైంది. అక్కడ సాధారణ పౌరుల నివాస గృహాలపైన మాత్రమే కాదు.. స్కూళ్లు, ఆస్పత్రులపైనా రష్యా సైన్యం దాడి చేసింది. ఇప్పటివరకు మరియుపోల్‌లో 2వేలమందికి పైగా స్థానికులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

Also Read:

Russia Ukraine War: యుద్ధంలో తెరపైకి జీవరసాయన ఆయుధాలు.. అసలు అవి ఎంత ప్రమాదకరమో తెలుసా

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..