Triple Murder Case: కువైట్ త్రిపుల్ మర్డర్ కేసు.. టీవీ9 కథనాలకు స్పందించిన ఇండియన్ ఎంబసీ అధికారులు..

Kuwait Venkatesh status: కువైట్‌లోని ఆర్దియా త్రిపుల్ మర్డర్ కేసులో చిక్కుకున్న బాధితుడి గురించి టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు భారీ స్పందన వచ్చింది. ముగ్గురి హత్యల కేసులో ఆరోపణలు

Triple Murder Case: కువైట్ త్రిపుల్ మర్డర్ కేసు.. టీవీ9 కథనాలకు స్పందించిన ఇండియన్ ఎంబసీ అధికారులు..
Arrest
Follow us

|

Updated on: Mar 14, 2022 | 7:04 AM

Kuwait Venkatesh status: కువైట్‌లోని ఆర్దియా త్రిపుల్ మర్డర్ కేసులో చిక్కుకున్న బాధితుడి గురించి టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు భారీ స్పందన వచ్చింది. ముగ్గురి హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లాకు చెందిన వెంకటేష్‌ ఇష్యూపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలు, స్పెషల్ డిబేట్‌తో నాయకులు, అధికారులు రంగంలోకి దిగారు. వెంకటేశ్‌కు న్యాయం చేసే దిశగా ఇండియన్ ఎంబసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్రిపుల్ మర్డర్ కేసుపై నిజ నిజాలను పరిశీలించేందుకు కువైట్ ప్రభుత్వంతో చర్చిస్తున్నారు ఇండియన్ ఎంబసి అంబాసిడర్ సిబి జార్జ్. ప్రస్తుతం కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంకటేష్ ను సెంట్రల్ జైలుకు రిఫర్ చేస్తూ 21రోజుల పాటు రిమాండ్ విధించారు.

ఈ విషయంపై మరో రెండు మూడు రోజులలో ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియన్ ఎంబసీని ఆశ్రయించారు తెలుగు వ్యక్తులు. హత్యలు జరిగిన తీరుపై విచారించాలని ఎంబీసీని తెలుగు వ్యక్తులు కోరారు. వెంకటేష్ కు పూర్తి న్యాయం జరిగేలా చేడాలని కోరారు. యునైటెడ్ ఫోరం తరుపున వెంకటేష్ కు అన్నివిధాల న్యాయం చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారం కడప కలెక్టరేట్‌కు చేరింది. బాధితుడి భార్య స్వాతి వివరాలివ్వాలని కలెక్టరేట్‌ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి.

అయితే ఇవాళ కడప ఎస్పీని వెంకటేష్ భార్య స్వాతి కలవనుంది. జరిగిన విషయాన్ని ఎస్పీకి తెలియజేయనుంది. స్దానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి.. కువైట్ లో తన భర్తకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించించింది స్వాతి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని స్వాతికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

Also Read:

Pawan Kalyan: సమరశంఖం పూరించనున్న పవన్ కల్యాణ్.. నేడు జనసేన ఆవిర్భావ వేడుక..

Tirumala Teppotsavam: తిరుమలలో వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు.. రెండేళ్ల తర్వాత కనుల విందుగా..