AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Teppotsavam: తిరుమలలో వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు.. రెండేళ్ల తర్వాత కనుల విందుగా..

తిరుమలలో వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు. తొలి రోజు సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీవారు.

Tirumala Teppotsavam: తిరుమలలో వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు.. రెండేళ్ల తర్వాత కనుల విందుగా..
Tirumala Teppotsavam
Sanjay Kasula
|

Updated on: Mar 14, 2022 | 6:55 AM

Share

కోవిడ్‌ నిబంధనలతో రెండేళ్ల తర్వాత తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Salakatla Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ పుష్కరిణిలో ఐదు రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తుంది టీటీడీ. వేసవి ప్రారంభంలో పాల్గుణ మాసం శుధ్ద ఏకాదశి నాడు శ్రీవారి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ పౌర్ణమి వరకు కన్నుల పండువగా శ్రీవారి తెప్పోత్సవాలు జరుగుతాయి. రోజుకో అవతారంలో తెప్పలపై స్వామివారు విహరిస్తారు. పుణ్ణమి నాడు నిర్వహిస్తున్న తెప్పోచ్చవాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. మొదటి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామ అవతారంలో స్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులను అభయప్రదానం చేశారు.

విద్యుత్ కాంతుల అలంకరణ.. భక్తుల గోవింద నామాస్మరణ మధ్య సీతారామ లక్ష్మణ సమేతుడిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రెండవ రోజు ద్వాదసి నాడు రుక్మిణి సమేత శ్రీకృష్ణ అవతారంలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. మూడవ రోజు త్రయోదశి నాడు శ్రీదేవీ, భూదేవి సమేత మలయప్ప స్వామి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు.

నాల్గొవరోజు 5 ప్రదక్షణలు.. ఐదవ రోజు 7 ప్రదక్షణలతో స్వామి వారి తెప్పోత్సవాలు మూగుస్తాయి. దీంతో మార్చి 15, 16, 17న తెప్పోత్సవాల కారణంగా స్వామి వారికి నిర్వహించే అర్జిత బ్రహ్మోత్సవం.. సహస్ర దీపాలంకరణను రద్దు చేసింది టీటీడీ.

ఇవి కూడా చదవండి: Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్‌.. ఇరాక్‌ లోని యూఎస్‌ ఎంబసీపై మిస్సైల్‌ దాడి..

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..