AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్‌.. ఇరాక్‌ లోని యూఎస్‌ ఎంబసీపై మిస్సైల్‌ దాడి..

అమెరికా -ఇరాన్‌ మధ్య యుద్దం తప్పదా ? ఇరాక్‌ లోని యూఎస్‌ ఎంబసీపై ఇరాన్‌ మిస్పైల్‌ దాడిలో 12 మంది చనిపోవడం సంచలనం రేపింది. పశ్చిమాసియాలో ఈ దాడితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్‌.. ఇరాక్‌ లోని యూఎస్‌ ఎంబసీపై మిస్సైల్‌ దాడి..
Us Consulate In Iraq
Sanjay Kasula
|

Updated on: Mar 13, 2022 | 9:50 PM

Share

ఉక్రెయిన్‌-రష్యా మధ్య మహా యుద్ధం(Russia Ukraine War) జరుగుతోంది. ఈ యుద్దాన్ని ఆపడానికి ప్రపంచదేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్న వేళ మరో పెద్ద తలనొప్పి వచ్చింది. ఇరాన్‌-అమెరికా మధ్య యుద్ద మేఘాలు కమ్ముకోవడం తీవ్ర కలకలం రేపింది. ఇరాక్‌ లోని అమెరికా దౌత్యకార్యాలయంపై వరుసగా క్షిపణి దాడులు చేసి ఇరాన్‌ అగ్రరాజ్యానికి సవాల్‌ విసిరింది. ఇరాక్‌ లోని ఇర్బిల్‌ ప్రాంతంలో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై..వరుసగా 12 మిస్సైల్స్‌తో విరుచుకుపడింది ఇరాన్‌. అగ్రరాజ్యం అమెరికాను రెచ్చగొట్టేలా..ఇరాక్‌లోని అమెరికా కాన్సులేట్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది. 12కు పైగా క్షిపణులను సంధించింది. తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని అమెరికా రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. ఇరాన్ భూభాగంపై నుంచి 12 బాల్లిస్టిక్ మిస్సైళ్లు ఇరాక్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయం వైపు దూసుకొచ్చాయని నిర్ధారించారు. ఈ దాడిలో 12 మంది చనిపోయినట్టు తెలుస్తోంది.

ఇర్బిల్‌లో అమెరికా ఎంబసీపై దాడిని పూర్తిగా సమర్ధించుకుంది ఇరాన్‌ . అమెరికా ఎంబసీ ఇజ్రాయెల్‌ ఏజెంట్లకు అడ్డాగా మారిందని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ఆరోపించింది. ఇజ్రాయెల్‌ దాడిలో తమ ఇద్దరు సైనికుల మృతికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు తెలిపింది. ఈ ఘటన తరువాత మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో తీవ్ర అలజడి నెలకొంది. అమెరికా దౌత్యకార్యాలయాలపై మరిన్ని దాడులు జరగవచ్చన్న అనుమానంతో సెక్యూరిటీని పెంచారు.

గత కొంతకాలంగా అమెరికా -ఇరాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. అమెరికా అండతోనే ఇజ్రాయెల్‌ రెచ్చిపోతోందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. అయితే కవ్వింపులకు పాల్పడుతున్న ఇరాన్‌కు గుణపాఠం తప్పదని అటు అమెరికా , ఇటు ఇజ్రాయెల్ హెచ్చరించాయి.

ఇవి కూడా చదవండి: Honey Bitter: ఇక్కడ తేనె చెదుగా ఉంటుంది.. అయినా అమృతమే.. ఈ ప్రదేశంలో అదే స్పెషల్.. ఎక్కడంటే..

Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..