Viral Video: బాబోయ్ ఏంటిది..? గడ్డి అనుకొని టచ్ చేస్తే ప్రాణం పోయేదే.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్!
Mysterious Furry Green Snake: సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతుంటాం.. జంతుప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి. దాదాపు అన్ని రకాల పాములు విషపూరితంగా..
Mysterious Furry Green Snake: సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతుంటాం.. జంతుప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి. దాదాపు అన్ని రకాల పాములు విషపూరితంగా.. అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. తాజాగా ఓ పాము అందరినీ భయపెడుతోంది. నాచు (గడ్డి) వలే ఉన్న ఈ పాము ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అరుదైన పాము థాయిలాండ్ చిత్తడి నేలలో కనిపించింది. ఇది మిస్టీరియస్ ‘ఫర్రీ గ్రీన్ స్నేక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది ‘పఫ్-ఫేస్డ్ వాటర్ స్నేక్’ అయి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
థాయిలాండ్ లోని చిత్తడి నేల ప్రాంతంలో ఈ పాము కనిపించినట్లు పేర్కొంటున్నారు. ఇది పైన నాచువలే ఆకుపచ్చ కలర్‌లో ఉన్న ఈ పామును నెటిజన్లను కలవరపెడుతోంది. రెండు అడుగుల పొడవున్న ఈ జీవి నీటిలో కదులుతున్నట్లు కనిపిస్తోంది. థాయిలాండ్‌లోని సఖోన్ నఖోన్‌లో 49 ఏళ్ల తూ (Tu).. వ్యక్తి ఈ పామును గుర్తించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ క్లిప్ తేదీ, ఖచ్చితమైన సమాచారం మాత్రం ధృవీకరించడం లేదు. సఖోన్ నఖోన్‌లోని తు ఇంటికి సమీపంలో చిత్తడి నీటిలో ఈ జీవి సంచరిస్తుండగా.. గుర్తించినట్లు పేర్కొంటున్నారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పామును చూడలేదంటూ స్థానికులు పేర్కొన్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
న్యూస్‌ఫ్లేర్ ప్రకారం.. కొంతమంది స్థానికులు పాముల శరీరంపై నాచు పెరుగుతుందేమోనని.. లేకపోతే నీటి పాము కావచ్చంటూ పేర్కొంటుున్నారు. NSW సెంట్రల్ కోస్ట్‌లోని వైల్డ్‌లైఫ్ ARC కి చెందిన ప్రతినిధి సామ్ చాట్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. చర్మం పైన ఉండే పొలుసులు ఎక్కువగా కెరాటిన్‌తో తయారవుతాయన్నారు. పాకుతున్నప్పుడు అవి ఆ పొలుసుల వెలుపలి భాగం తొలుచుకుంటుందన్నారు. దీనిని పఫ్-ఫేస్డ్ వాటర్ స్నేక్ లేదా మాస్క్డ్ వాటర్ స్నేక్ అని కూడా అంటారన్నారు.
వైరల్ వీడియో..
ఈ పాములు ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే హోమలోప్సిడే కుటుంబానికి చెందిన తేలికపాటి విషపూరిత పాము జాతి అని పేర్కొన్నారు. ఈ జాతులు ఉత్తర సుమత్రా నుంచి సలాంగా ద్వీపం, ఇండోనేషియా, బోర్నియో, మలేషియా, థాయిలాండ్‌లో కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: