AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..

పంచాయితీ నిధుల గోల్ మాల్ పై ఓ సర్పంచ్ వినూత్న నిరసనకు దిగారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాఫిక్ గా మారింది.

Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..
Aluru Major Panchayat Sarpa
Sanjay Kasula
|

Updated on: Mar 13, 2022 | 5:46 PM

Share

పంచాయితీ నిధులు సర్పంచ్ కి తెలియకుండా మాయమయ్యాయంటూ నిరసనకు దిగారు కర్నూలు జిల్లా(Kurnool District) ఆలూరు మేజర్ పంచాయతీ(Aluru Major Panchayat) సర్పంచ్ అరుణదేవి. భిక్షాటన చేస్తూ వినూత్న రితీలో నిరసన తెలిపారు. పంచాయతీ నిధులు సర్పంచ్‌లకు తెలియకుండా రాష్ట్రప్రభుత్వం కోటి పది లక్షల రూపాయలు ఇతర అకౌంట్లకు మల్లించిందని ఆరోపించారు సర్పంచ్. గ్రామ పంచాయతీలో డబ్బులు లేకుంటే అభివృద్ధి ఎలా చేయాలంటూ ప్రభుత్వాన్ని పశ్నించారు సర్పంచ్ అరుణదేవి. గ్రామ పంచాయితీ- గ్రామ ప్రభుత్వాలు. ప్రభుత్వం పంచాయితీ ఖాతాల నుండి 14,15 ఆర్థిక సంఘం నిధులు లాగెసుకుంది. ఈ సందర్భంగా ఆలూరు సర్పంచ్ భిక్షాటన చేస్తున్నారు. దీంతో ఆలూరు అభివృద్ధి కుంటుపడింది. గ్రామ స్వరాజ్యం ఎక్కడ అనే కొటేషన్స్‌తో ప్లకార్డు ప్రదర్శిస్తూ పంచాయితీలో తిరుగుతూ నిరసన తెలిపారు.

అంతేకాదు పంచాయితీలోని గుడి, బడి, దుకాణాలు, మద్యం షాపు వద్దకు వెళ్లి వారి వద్ద భిక్షాందేహి అంటూ భిక్షాటన చేశారు. షాపు షాపుకు తిరుగుతూ కొటిన్నర నిధులు గోల్ మాల్ ఆయ్యాయి. ఆలూరుకు నీటి సదుపాయం లేదు అంటూ ప్రజలకు వివరించారు.

గ్రామంలో అభివృద్ధి పనులకు అధికార పార్టీ నేతలు అడ్డుకొంటున్నారని ఆరోపించారు సర్పంచ్ అరుణదేవి. గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిచినప్పటికి అభివృద్ధి చేసేందుకు నిధులు లేక ఖాళీ చేతులతో ఆఫీసులో కూర్చోవాల్సి వస్తుందంటూ ఆరోపించించారు సర్పంచ్.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆలూరు పంచాయితీ సర్పంచ్ చేసిన నిరసన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి: AP Crime News: కూర్చున్నట్టే కూర్చొని కత్తితో దాడి చేశాడు.. సీసీ టీవీలో రికార్డయిన షాకింగ్ దృశ్యాలు..