Vehicles Auction: సీజ్చేసిన వాహనాలకు వేలం.. ఖజానాకు భారీ లాభం.. వచ్చిందెంతంటే..
వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం నిర్వహించారు కర్నూలు జిల్లా ఆదోని పొలీసులు. వాహనాల వేలానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
కర్నూలు జిల్లా ఆదోనిలో కర్నాటక అక్రమ మద్యం, నాటుసారా రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు వేలంపాట(Vehicles Auction) నిర్వహించారు SEB అధికారులు. ముందుగానే రెండు వేల రూపాయలు డిపాజిట్ చేసి వారిని మాత్రమే ఆక్షన్లో పాల్గోనేలా అనుమతించారు. ఆదోని SEB స్టేషన్ లో సూపరింటెండెంట్ భరత్ నాయక్ ఆధ్వర్యంలో 14 బైక్ లు రెండు ఆటోలకు వేలం నిర్వహించారు. వీటిలో 8 వాహనాలకు ఆర్సీలు ఉన్నాయని.. వాటిని ఆఫీసు నుంచి లెటర్ ఇస్తామని చెప్పారు ఎస్ఈబీ సూరిండెంట్ భరత్ నాయక్. ఆర్టీవో ఆఫీసులో రిజిస్టేషన్ మార్చి ఇస్తారని తెలిపారు. కొన్ని వాహనాలకు స్క్రాప్ ఉన్నాయని.. వాటికి ఎలాంటి ఆర్సీలు ఉండవని చెప్పారు. వేలంలో దక్కించుకున్న ప్రతి వాహనానికి జీఎస్టీ వర్తిస్తుందన్నారు ఎస్ఈబీ సూరిండెంట్ భరత్ నాయక్.
2018 నుంచి పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించినట్లు చెప్పారు. ఇలా ఆక్షన్ ద్వారా వేలంలో వచ్చిన డబ్బును ప్రభుత్వానికి జమ చేయడం జరుగుతుందని తెలిపారు భరత్ నాయక్. ఆక్షన్ కోసం డిపాజిట్ చేసి .. వేలంలో వాహనాలను దక్కించుకోని వారికి వారి డిపాజిట్ తిరిగి ఇవ్వడం జరుతుందన్నారు.ఇక పలు కేసులో సీజ్ చేసిన వందల సంఖ్యలో స్టేషన్ పేరుకుపోయి తుప్పుపట్టిపోతున్న వాహనాలకు సైతం వేలం నిర్వహించాలని కోరుతున్నారు ఆదోని ప్రజలు.
ఇక తిరుపతిలో కూడా వివిద కేసుల్లో పట్టుబడ్డ 46 బైక్ లు, రెండు కార్లకు వేలం నిర్వహించారు అధికారులు. ఈవాహనాల ఈ వేలం ద్వారా తిరుపతి స్టేషన్‌కు 3 లక్షల12 వేల 936 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్లో అధికారులు కూడా వివిధ రకాల వాహనాలను వేలం వేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్‌పి.
ఇవి కూడా చదవండి: Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్.. ఇరాక్ లోని యూఎస్ ఎంబసీపై మిస్సైల్ దాడి..
Health Tips: వసంతకాలంలో ఈ ఆయుర్వేద చిట్కాలను అనుసరించండి.. అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం..