Horoscope Today: వీరికి బంధుమిత్రులు విరోధం ఏర్పడుతుంది.. అనారోగ్య సమస్యలు అధికం.. సోమవారం రాశి ఫలాలు..
ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించే వారు అధికంగా ఉన్నారు. రోజులో తమ జీవితంలో జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవడానికి
ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించే వారు అధికంగా ఉన్నారు. రోజులో తమ జీవితంలో జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మార్చి 14న (సోమవారం) అమృతఘడియలు.. పగలు 1.54 నుంచి 2.44 వరకు ఉండగా.. దుర్ముహూర్తం.. పగలు 12.33 నుంచి 1.22 వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యం లేదు. రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందామా.
మేష రాశి.. ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మికంగా ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో విభేధాలు తగ్గుతాయి.. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.
వృషభ రాశి.. ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆస్తి వివాదాల్లో తొందరపాటు పనికిరాదు.. ఉద్యోగరీత్యా స్థానచలనం ఉంటుంది.
మిథున రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులకు అడ్డంకులు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు శుభవార్తలు వింటారు. కుటుంబంలో పరిస్థితులు సంతోషకరంగా ఉంటాయి. విందులు…వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
సింహ రాశి.. ఈరోజు వీరికి స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. బంధుమిత్రలతో విరోధం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రుణ ప్రయత్నాలు తగ్గుతాయి.
కన్య రాశి.. ఈరోజు వీరు నూతన వస్తువులు.. ఆభరణాలు ఖరీదు చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన పనులను ప్రారంభిస్తారు. ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రయణాలు చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు.
తుల రాశి.. ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. కుటుంబంలో విరోధాలు తగ్గుతాయి.. ఉద్యోగాల్లో అభివృద్ధి జరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
మకర రాశి.. వీరు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయణాలు చేస్తారు. నూతన వ్యక్తులను పరిచయమవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి.. ఈరోజు వీరు విదేశయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో విరోదం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రాయడం జరిగింది.
Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..
Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..
Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..