Russia Ukraine War: యుద్ధంలో తెరపైకి జీవరసాయన ఆయుధాలు.. అసలు అవి ఎంత ప్రమాదకరమో తెలుసా

Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో అణ్వాయుధాల ప్రయోగంపై భయాలు అందరినీ వెంటాడుతుండగా.. ఇప్పుడు వీటికి బయోలాజికల్ వెపన్స్(Bio Weapons) తోడయ్యాయి. జీవరసాయన ఆయుధాల అంశం తాజాగా తెరపైకి వచ్చింది.

Russia Ukraine War: యుద్ధంలో తెరపైకి జీవరసాయన ఆయుధాలు.. అసలు అవి ఎంత ప్రమాదకరమో తెలుసా
Biological Weapons
Follow us
Ayyappa Mamidi

| Edited By: Surya Kala

Updated on: Mar 13, 2022 | 10:16 AM

Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో అణ్వాయుధాల ప్రయోగంపై భయాలు అందరినీ వెంటాడుతుండగా.. ఇప్పుడు వీటికి బయోలాజికల్ వెపన్స్(Bio Weapons) తోడయ్యాయి. జీవరసాయన ఆయుధాల అంశం తాజాగా తెరపైకి వచ్చింది. అమెరికాకు(USA) చెందిన జీవ ఆయుధ ల్యాబ్‌లు ఉక్రెయిన్ లో ఉన్నాయంటూ రష్యా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రష్యా సైతం అత్యంత ప్రమాదకర ఆయుధాలను వినియోగించి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించాలని చూస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా కలవరం మెుదలైంది. అసలు ఈ జీవ రసాయన ఆయుధాల వినియోగం వల్ల నష్టాలు ఏమిటి.. అసలు వీటిలో ఉన్న వివిధ రకాలు.. వాటి వల్ల జరిగే నష్టం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ముందుగా నెర్వ్ ఏజెంట్ల గురించి తెలుసుకుందాం.. వీటిని వార్ లో వినియోగిస్తే అవి మనిషిలోని నాడుల నుంచి కండరాలకు వెళ్లే సందేశాలను అడ్డుకుంటాయి. దీని వల్ల పక్షవాతం వచ్చి అవయవాలు పనిచోయటం మానేస్తాయి. వీటి తరువాత మరొక రకమైనవి రైసిన్ టాక్సిన్లు. ఇవి తక్కువ ప్రమాదకరమైనప్పటికీ వేగంగా వ్యాప్తి చెందుతాయి. దీని ప్రయోగం వల్ల మనుషుల్లో వ్యాధి లక్షణాలు సైతం స్వల్పంగా కనిపిస్తాయి. వీటిలో మరోరంకమైన ఆయుధం సైనైడ్. దీనిని చరిత్రంలో చాలా కాలం ముందునుంటే యుద్ధాల్లో వాడుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల గుండెపోటు, పక్షవాతం వంటివి సంభవిస్తాయి. వీటితో పాటు చర్మంపై బొబ్బలు కలిగించేందుకు సల్ఫర్ మస్టర్డ్ ను వాడుతుంటారు. వీటికి తోడు వివిధ వైరస్ లు, బ్యాక్టీరియాలు వినియోగిస్తుంటారు. ఇలా వివిధ ఇతర రకాలైన జీవ ఆయుధాలను వినియోగాలు ఉన్నాయి.

సిరియాలనూ విచ్చలవిడిగా రసాయన ఆయుధాలను వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013 ఆగస్టు 21న సిరియా రాజధాని డమాస్కస్‌ శివార్లలోని ఘౌటా ప్రాంతంపై సారిన్‌ అనే నెర్వ్‌ ఏజెంటుతో కూడిన రాకెట్లను ప్రయోగించింది. దీనివల్ల శ్వాసకోశ వ్యవస్థ స్తంభించిపోయి, ఊపిరాడక నురగలు కక్కుతూ వందల మంది అత్యంత దారుణంగా చనిపోయారు. దీనిని అప్పట్లో అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు తీవ్రంగా వెతిరేకించాయి. 1962-71 మధ్య వియత్నాం వార్ లో అమెరికా సైతం ఏజెంట్ ఆరెంజ్ అనే ప్రమాదకర రసాయనాన్ని వినియోగించింది. ఈ రసాయనాల వల్ల క్యాన్సర్లు, మధుమేహం, పిల్లలు లోపాలతో పుట్టడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అమెరికా రసాయనాల ప్రభావం 30 లక్షల మంది వియత్నాం పౌరులపై పడిందని రెడ్‌క్రాస్‌ వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. లక్షల మంది పిల్లలు లోపాలతో పుట్టారు. అమెరికా సైనికులు సైతం దీనికి ప్రభావితమయ్యారు.

Gold Imports: కరోనా ముందునాటికి బంగారం దిగుమతులు.. ఎక్కడి నుంచి ఎంత బంగారం వస్తోందంటే..

Crude Oil: ఆయిల్ ధరలతో లాభపడనున్న ఆ వ్యాపారవేత్త.. కొత్తగా దేశంలో భారీ పెట్టుబడులు..