Russia – Ukraine Conflict: నిర్మానుష్యంగా కీవ్ నగరం.. అక్కడి ప్రజలంతా ఎక్కడికి వెళ్లారంటే..
Russia - Ukraine Conflict: రష్యా దాడులతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రష్యాను
Russia – Ukraine Conflict: రష్యా దాడులతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రష్యాను అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. కానీ, రష్యా బలగాల ముందు.. ఉక్రెయిన్ బలం సరిపోవడంలేదు. అయినప్పటికీ.. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీవ్ నగరం స్వాధీనమే లక్ష్యంగా రష్యా వస్తుండగా.. కీవ్ నగరం మొత్తాన్ని బంద్ చేసింది ఉక్రెయిన్ సర్కార్. నగర ప్రజలంతా బంకర్లలలోకి వెళ్లిపోయారు. కీవ్‌లో రష్యా దళాలు బాంబుల మోత మోగిస్తుండటంతో కీవ్‌లో ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు ఎక్కడ వీలయితే అక్కడ సేఫ్టీ ప్లేస్‌లో ఉండాలని ఆదేశించింది. బంకర్లు, బేస్‌మెంట్, కుదిరితే బాత్‌రూముల్లో తలదాచుకోవాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని చెప్పింది. లైట్లు కూడా బంద్ చేసి జాగ్రత్తగా ఉండాలంది. ప్రభుత్వ పెద్దలంతా ఓ హోటల్ బంకర్‌లో ఉన్నట్లు ప్రకటించింది. చాలా సమయం నుంచి ఈ బంకర్‌లోనే తలదాచుకుంటున్నామని తెలిపారు. కాగా, రష్యా దురాగతంలో కీవ్ నగరం ఎప్పుడూ లేని విధంగా పూర్తిస్థాయిలో స్తంభించిపోయింది. హోటల్ సిబ్బందితో సహా ప్రజలంతా బంకర్లలోనే ఉన్నారు.
నిత్యం రద్దీగా ఉండే ఫ్రీడం స్వ్కేర్ సైతం నిర్మానుష్యమైంది. రోడ్ల మీద ఒక్కరు కూడా తిరగడం లేదు. కీవ్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ లేదు. ఏటీఎంలు లేవు. దుకాణాలు లేవు. ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనమే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ ఆర్మీ వెహికిల్స్‌పైకి దాడి చేస్తున్నారు. సెంట్రల్ స్క్వేర్ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. జెలెన్‌స్కీ నివాసంపై దాడికి యత్నిస్తున్నారు. తద్వారా ఉక్రెయిన్‌లో సర్కారును మార్చేందుకు రష్యా యత్నిస్తుంది. ఉక్రెయిన్‌లో సర్కారు మార్చేదాకా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది.
‘టీవీ9 డెస్క్’
Also read:
Bheemla Nayak : పవర్ స్టార్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ ప్రసంశలు..