Russia – Ukraine Conflict: పుతిన్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?.. ఆ భయంతోనే ఈ యుద్ధానికి దిగారా?.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
Putin Next Target: వ్లాదిమిర్ పుతిన్, రష్యాకు ఏకఛత్రాధిపతి. 2036 వరకు పుతిన్‌కు ఎదురే లేదు. అంటే ఇంకో పద్నాలుగేళ్లు పుతినే..
Putin Next Target: వ్లాదిమిర్ పుతిన్, రష్యాకు ఏకఛత్రాధిపతి. 2036 వరకు పుతిన్‌కు ఎదురే లేదు. అంటే ఇంకో పద్నాలుగేళ్లు పుతినే రష్యా ప్రెసిడెంట్. పదవీ కాంక్షతో ఏకంగా దేశ రాజ్యాంగాన్నే మార్చేసిన అధికారలోలుడు ఆయన. ఇప్పుడు పుతిన్ వయసు 69ఏళ్లు. ఈ మలి వయసులో పుతిన్‌కు ఎందుకింత యుద్ధకాంక్ష, అసలు దేనికోసం? రష్యా కోసమా? తన వ్యక్తిగత ప్రతిష్ట కోసమా? లేక USSR పునర్ నిర్మాణమే లక్ష్యమా? లేదంటే, పుతిన్ ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నారా?
తన కోసం రాజ్యాంగాన్నే మార్చేసిన పుతిన్.. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్నాడా? ప్రపంచ చక్రవర్తి కావాలని ఆశపడుతున్నాడా? పుతిన్ స్టె్ట్స్ చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయ్? పుతిన్ చేస్తున్న హెచ్చరికలు యావత్ ప్రపంచాన్నే దడ పుట్టిస్తున్నాయ్. ఆల్రెడీ ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న పుతిన్.. తన నెక్ట్స్ టార్గెట్ ఏంటో బయటపెట్టారు. ఫిన్‌లాండ్, ఆ పక్కనే ఉన్న స్వీడెన్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారాయన. తాము చెప్పినట్టు వినాల్సిందే, లేదంటే ఉక్రెయిన్ గతే పడుతుందంటూ స్వీడెన్, ఫిన్‌లాండ్‌కు వార్నింగ్ ఇచ్చారు పుతిన్. నాటో కూటమిలో చేరే ప్రయత్నం చేయొద్దంటూ డైరెక్ట్‌గా హెచ్చరికలు జారీ చేశారు.
ఉక్రెయిన్‌పై దాడులకు కారణమదేనా?.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ప్రధాన కారణం ఒక్కటే. నాటోలో చేరే ప్రయత్నం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. రష్యాతో బోర్డర్‌ను షేర్ చేసుకుంటున్న ఉక్రెయిన్, నాటోలో చేరితే అమెరికాకు ఈజీ టార్గెట్ అవుతామనేది పుతిన్ భయం. రష్యా చుట్టూ నాటో దేశాలు ఉండటమే దానికి కారణం. ఉక్రెయిన్ తర్వాత ఫిన్‌లాండ్, స్వీడెన్‌కు వార్నింగ్ ఇవ్వడం వెనక కూడా ప్రధాన కారణం ఇదే. ఫిన్‌లాండ్.. రష్యాతో బోర్డర్‌ను షేర్ చేసుకుంటుంటే, దాని పక్కనే ఉంది స్వీడెన్. అందుకే, తమ నెక్ట్స్ టార్గెట్ ఫిన్లాండ్, స్వీడెన్ అంటూ హెచ్చరికలు పంపారు పుతిన్. నాటోలో చేరే ప్రయత్నం చేస్తే ఎటాక్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఫిన్‌లాండ్ 3,922 కిలోమీటర్లు, స్వీడెన్ 4,345 కిలోమీటర్లు దూరంలో మాత్రమే ఉన్నాయి.
పుతిన్ యుద్ధకాంక్ష ఎటువైపు దారి తీస్తుంది? ఇదిలాఉంటే.. పుతిన్ యుద్ధకాంక్ష ఎటువైపునకు దారి తీస్తుందోనని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వైపు పరిస్థితులు వెళ్తాయా? పుతిన్‌ను ఆపేవాళ్లే లేరా? అమెరికా అలా చూస్తుండిపోతుందా? కేవలం, ఆంక్షలు, సైబర్ ఎటాక్స్‌కి మాత్రమే పరిమితం అవుతుందా? నాటో కూడా అంతేనా? పుతిన్‌ను కంట్రోల్ చేయలేదా? అసలు, ముందుముందు ఏం జరగబోతోంది? అని ప్రశ్నలు వేసుకుంటూ భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Also read:
Health Tips: ఒమిక్రాన్ నుంచి రక్షించుకునేందుకు ఈ నాలుగు అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోండి
Food Adulteration: బాబోయ్ కల్తీ.. ఆఖరికి దీన్ని కూడా వదల్లేదు ఈ కల్తీగాళ్లు..
Indian Defense-Panaji Jobs: పదో తరగతి అర్హతతో డిఫెన్స్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..