Russia – Ukraine Conflict: పారిపోను.. ఆయుధాలివ్వండి.. అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి రిప్లై..
Russia - Ukraine Conflict: ఒకపక్క రష్యా బాంబుల వర్షం కురిపిస్తోన్నా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.
Russia – Ukraine Conflict: ఒకపక్క రష్యా బాంబుల వర్షం కురిపిస్తోన్నా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. లేటెస్ట్‌గా ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు జెలెన్‌స్కీ. అది కూడా రష్యన్ దళాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్న కీవ్ నగరం నుంచి. దేశం విడిచి పారిపోయాయని వదంతులు సృష్టిస్తున్నారనన్న జెలెన్‌స్కీ, తానెక్కడికీ పారిపోలేదంటూ సెల్పీ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను ఉక్రెయిన్‌లోనే ఉన్నా, నా కుటుంబం కూడా ఉక్రెయిన్‌లోనే ఉంది’’ అంటూ తెలిపారు. ‘‘నేనెక్కడికీ పారిపోలేదు. నేను ఉక్రెయిన్‌లోనే ఉన్నా. దేశం విడిచి పారిపోయాయని వదంతులు సృష్టిస్తున్నారు. నా కుటుంబం కూడా ఉక్రెయిన్‌లోనే ఉంది. నేను కీవ్‌లోనే ఉన్నా. యుద్ధంలో ఒంటరైపోయాం. అయినా రష్యాను చూసి భయపడట్లేదు. మేమంతా ఉక్రెయిన్‌లోనే ఉంటాం. పోరాడి దేశాన్ని కాపాడుకుంటాం’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు.
అమెరికా ఆఫర్ తిరస్కరించిన జెలెన్‌స్కీ.. ఇదిలాఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా ఆఫర్ ఇచ్చింది. మరో దేశానికి తరలించేందుకు అమెరికా ఆయనకు స్నేహహస్తం అందించింది. కానీ ఆ ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించారు. ‘‘అందరం ఇక్కడే ఉన్నాం.. ఇక్కడే పోరాడుతాం.. నేను పారిపోను.. నాకు ఆయుధాలు పంపించండి చాలు. దేశాన్ని రక్షించుకుంటాం’’ అని అమెరికా ఆఫర్‌కు బదులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. అంతేకాదు.. ఉక్రెయిన్‌తో కలిసి యుద్ధం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, రష్యాకు అందరూ భయపడుతున్నారని అన్నారు.
Also read:
Bheemla Nayak : పవర్ స్టార్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ ప్రసంశలు..