Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. రెండు దేశాలలో ఎవరు ఎక్కువ శక్తివంతులు
Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ వార్‌లో ఎంతో మంది..
Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ వార్‌లో ఎంతో మంది బలయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంక్షలు, చర్చల ద్వారా రష్యా (Russia)పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యా దాడిలో ఉక్రెయిన్ (Ukraine) లోని నగరాలు ధ్వంసమవుతున్నాయి. రెండు దేశాల సైనిక బలం గురించి తెలుసుకుందాం.
► ఉక్రెయిన్‌లో 11 లక్షల మంది సైనికులు ఉండగా, అందులో 2 లక్షల మంది యాక్టివ్‌గా ఉన్నారు. 9 లక్షల మంది రిజర్వ్‌లో ఉన్నారు. అదే సమయంలో రష్యాలో 29 లక్షల మంది సైనికులు ఉన్నారు. వీరిలో 9 లక్షల మంది యాక్టివ్‌గా ఉండగా, 20 లక్షల మంది సైనికులు రిజర్వ్‌లో ఉన్నారు.
► యుద్ధ విమానాల గురించి చెప్పాలంటే.. ఉక్రెయిన్‌లో 98 యుద్ధ విమానాలు ఉండగా, రష్యా వద్ద 1511 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక మిలిటరీ హెలికాప్టర్లు ఉక్రెయిన్ 98తో పోలిస్తే రష్యాలో 544 అటాకింగ్ హెలికాప్టర్లు ఉన్నాయి.
► ఉక్రెయిన్‌లో 2596 ట్యాంకులు ఉండగా, రష్యా వద్ద 12,240 ట్యాంకులు ఉన్నాయి. ఉక్రెయిన్ 2040 ఫిరంగిదళం ఉండగా, రష్యా వద్ద 7571 ఫిరంగి ఉంది.
► ఉక్రెయిన్‌లో 12,303 సాయుధ వాహనాలు ఉండగా, రష్యా వద్ద 30,122 సాయుధ వాహనాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: