Zelenskyy: నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రష్యాతో అమీతుమీ తేల్చుకుంటాం: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

Zelenskyy: నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు. రష్యాతో అమీతుమీ తేల్చుకుంటాం.. మాకు విదేశాల నుంచి కూడా సాయం అందుతోంది.. అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..

Zelenskyy: నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రష్యాతో అమీతుమీ తేల్చుకుంటాం: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 26, 2022 | 6:08 PM

Zelenskyy: నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు. రష్యాతో అమీతుమీ తేల్చుకుంటాం.. మాకు విదేశాల నుంచి కూడా సాయం అందుతోంది.. అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Ukraine President Zelenskyy) ప్రకటించిన కాసేపటికే రష్యా వ్యూహం మార్చింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో సహా కీలక అధికారులను బంధించేందుకు గెరిల్లా (Guerrilla) బలగాలను రంగంలోకి దింపింది. 20 వేల మంది చెచెన్‌ గెరిల్లా బలగాలను కీవ్‌ మీద దండయాత్రకు పంపించాడు పుతిన్‌. వీళ్ల లక్ష్యం ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని బంధించడమే. కీవ్‌ సమీపంలోని అటవీప్రాంతంలో తిష్టవేసిన ఈ ప్రత్యేక బలగాలు నగరం లోకి చొచ్చుకెళ్లేందుకు ఆపరేషన్‌ చేపట్టాయి. శుక్రవారం కూడా కీవ్‌పై దాడికి 10 వేల మంది గెరిల్ల దళాలను పంపించారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.

ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోవడానికి ససేమిరా అనడంతో రష్యా అధ్యక్షుడు బలప్రయోగాన్ని మరింత వేగం చేయాలని డిసైడ్‌ అయ్యాడు. యుద్ధం కారణంగా మేం లొంగిపోమని, పోరాడతామని జెలెన్‌స్కీ అన్నారు. అయితే కీవ్‌పై పట్టు ఇంకా కోల్పోలేదని అన్నారు. అయితే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఖాళీ చేసి యూఎస్‌కు రావాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికా ప్రభుత్వం కోరింది. అందుకు అంగీకరిస్తే ప్రత్యేక విమానం పంపుతామని తెలుపగా, అందుఉ జెలెన్‌స్కీ నిరాకరించారు. తనకు అలాంటివేమి వద్దని, తనకు కావాల్సింది ఆయుధాలు కావాలని అన్నారు. మందుగుండు సామాగ్రి ఉంటే పోరాటానికి వెనుకడుగు వేయమని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యూనుయేల్‌ మైక్రాన్‌ సంచలన వ్యాఖ్యలు

Russia-Ukraine Crisis: శాంతి మంత్రం జపిస్తున్న తాలిబన్లు.. ఆ విషయంలో రష్యా, ఉక్రెయిన్‌కు సలహా