AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak : పవర్ స్టార్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ ప్రసంశలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ప్రస్తుతం థియటర్స్ లో సందడి చేస్తుంది. మొదటి షో నుంచి భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Bheemla Nayak : పవర్ స్టార్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ ప్రసంశలు..
Mahesh Babu And Pawan Kalya
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 28, 2022 | 11:22 AM

Share

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ప్రస్తుతం థియటర్స్ లో సందడి చేస్తుంది. మొదటి షో నుంచి భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పవర్ స్టార్ మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు పవన్. పవన్ కళ్యాణ్ -రానా నటించిన భీమ్లానాయక్ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ రాశారు. ‘భీమ్లానాయక్‌’ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌ సొంతం చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. థియేట‌ర్ల వ‌ద్ద ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో మ‌రింత ఖుషీ అవుతున్నారు. డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, బాణాసంచా మోతతో థియేట‌ర్ల వ‌ద్ద‌ హోరెత్తిస్తున్నారు. ఇక ఈ సినిమా పై సినిమాతారలు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీప్రముఖులు ఈ సినిమా గురించి ట్వీట్స్ చేశారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భీమ్లానాయక్ సినిమా పై పొగతాల వర్షం కురిపించారు. పవర్ స్టార్ తన ఎనర్జిటిక్, ఫైరింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశారని అన్నారు మహేష్. అలాగే రానా డానియల్ శేఖర్ గా అద్భుతంగా నటించాడని రాసుకొచ్చారు మహేష్. త్రివిక్రమ్ ఎప్పటిలానే అద్భుతంగా డైలాగులు రాశారని..   విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని. తమన్ సంగీతం వెంటాడుతుంది అలాగే  మంత్రముగ్ధులను చేసిందిఅని అన్నారు మహేష్. అలాగే భారీ విజయాన్ని అందుకున్న చిత్రయూనిట్ కు మహేష్ అభినందనలు తెలిపారు. ఈమేరకు మహేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్స్ పై అటు మహేష్ అభిమానులు, ఇటు పవన్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiara Advani And Siddharth: త్వరలో ఏడడుగులు నడవబోతున్న మరో ప్రేమజంట!.. కియారా, సిద్ధార్థల పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్‌!

Bigg Boss Non-Stop Grand Launch Highlights: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్.. మరోసారి అదరగొట్టిన నాగ్

Samyuktha Menon: ఛార్మినార్ వద్ద సందడి చేసిన భీమ్లా నాయక్ హీరోయిన్… వైరల్ అవుతున్న ‘సంయుక్త’ ఫొటోస్..