Bigg Boss Non-Stop: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ షురూ.. బిగ్ బాస్ ఓటీటీ హంగామా మొదలైంది.
రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది.
Bigg Boss Non-Stop : రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధం అయ్యింది . ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఓటీటీ మొదలైంది. గ్రాండ్ లాంఛ్ కార్యక్రమం ప్రసారాలు శనివారం సాయంత్రం 6 గం.ల నుంచి ప్రారంభమయ్యింది. ఈ సారి 24 గంటల ఎంటర్ టైన్మెంట్ తో ఓటీటీలో ఈ ఫో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మొత్తం 17 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. 85 జరిగే నాన్ స్టాప్ బిగ్బాస్ ఓటీటీ హంగామా ఎలా వుండబోతోంది అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది.
ఈసారి బిగ్ బాస్ హౌస్ చాలా ప్రత్యేకంగా ఉంది. గత బిగ్ బాస్ హౌస్ లతో పోలిస్తే ఈసారి చాలా సుందరంగా బిగ్ బాస్ హౌస్ ను ముస్తాబు చేశారు. హౌస్ లోకి ఈసారి ముమైత్ ఖాన్ – అఖిల్ సార్థక్ – అషురెడ్డి – హమీదా – సరయు – అరియానా గ్లోరీ -మహేష్ విట్టా – యంకర్ స్రవంతి చొక్కారపు – ఆర్జే చైతూ – యాంకర్ శివ – అనిల్ రాథోడ్ – మిత్ర శర్మ – అజయ్ – బిందు మాధవి – బమ్ చిక్ బబ్లూ ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ముందుగా అందమైన అమ్మాయిలతో నాగార్జున ఎంట్రీ అదరగొట్టారు. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందొ పరిచయం చేశారు.. ఆతర్వాత ఒకొక్కరిని స్టేజ్ పైకి పిలిచారు.
మరిన్ని ఇక్కడ చదవండి :