Lock Upp Show: కంగనాకు షాక్‌.. లాక్‌ అప్‌ షోను నిలిపివేయాలని హైదరాబాద్‌ కోర్టు ఉత్తర్వులు.. కారణమేంటంటే..

Kangana Ranaut: ఇప్పటికే వెండితెరపై అదరగొడుతోన్న బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ బుల్లితెరపై కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘లాక్ అప్’  (Lock Upp Show) అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది

Lock Upp Show: కంగనాకు షాక్‌.. లాక్‌ అప్‌ షోను నిలిపివేయాలని హైదరాబాద్‌ కోర్టు ఉత్తర్వులు.. కారణమేంటంటే..
Kangana Ranaut
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Feb 27, 2022 | 8:54 AM

Kangana Ranaut: ఇప్పటికే వెండితెరపై అదరగొడుతోన్న బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్  డిజిటల్ తెరపై కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘లాక్ అప్’  (Lock Upp Show) అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది. బాలాజీ టెలిఫిలిమ్స్‌ అధినేత ఏక్తా కపూర్ (Ekta kapoor) ఈ రియాలిటీ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. నేటి (ఫిబ్రవరి 27) నుంచి ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో ఈ షో ప్రసారం చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఈక్రమంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ‘లాక్ అప్’ నిర్మాతలకు షాక్‌ ఇచ్చింది. షోను ప్రసారం చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ జారీ చేసింది.

కాగా సనోబర్ బేగ్ అనే వ్యక్తి లాక్‌ అప్‌ షోను నిలిపి వేయాలని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ తనదని.. దీనిపై సంబంధిత సంస్థ ప్రతినిధులతో చర్చించానన్నారు. ఈ కాన్సెప్ట్‌తో షోను ప్రసారం చేయవద్దని వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు సనోబర్‌. కాగా సనోబర్‌ విజ్ఞప్తిపైన్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. లాక్‌ అప్‌ షోను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..

Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!

IIPS Mumbai Jobs: ఐఐపీఎస్‌లో అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ  ద్వారానే ఎంపికలు..