Samantha: వివరించడానికి మాటలు సరిపోవడం లేదు.. ఆ స్టార్ హీరోయిన్ పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తిచేసిన సామ్..

Samantha: వివరించడానికి మాటలు సరిపోవడం లేదు.. ఆ స్టార్ హీరోయిన్ పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 27, 2022 | 3:54 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తిచేసిన సామ్.. ఇప్పుడు యశోధ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది సామ్. ఇటీవల విడాకులు.. అవమానం.. డబ్బు.. జీవితం అంటూ విల్ స్మిత్ కోట్ తన ఇన్ స్టాలో షేర్ చేసి నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండా.. విడాకుల ప్రకటన అనంతరం సామ్.. తన సోషల్ మీడియా ఖాతాల్లో మోటివేషనల్ కోట్స్.. లేటేస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా గంగూభాయ్ కతియావాడి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించగా.. ఇందులో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ యాష్కి, హ్యూమా ఖురేషి .. తదితరులు కీలకపాత్రలు పోషించారు. ముంబయిలోని మాఫియా క్వీన్‌ గంగూబాయ్​ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అలియా వేశ్వ పాత్రలో నటించింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‎తో దూసుకుపోతుంది.

Sam

Sam

నటనగా పరంగా అలియా ఇప్పటికే సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ సినిమాపై.. అలియా నటనపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవడం లేదు. ప్రతీ ఒక్క డైలాగ్.. హావాభావాలు.. నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి ” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?