Bigg Boss Non-Stop Grand Launch Highlights: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్.. మరోసారి అదరగొట్టిన నాగ్

Rajeev Rayala

|

Updated on: Feb 26, 2022 | 9:41 PM

Bigg Boss Telugu OTT Launch Highlights : రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు నాన్ స్టాప్ గా..

Bigg Boss Non-Stop Grand Launch Highlights: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్.. మరోసారి అదరగొట్టిన నాగ్
Bigg Boss

రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి మనముందుకు వచ్చేసింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఓటీటీ మొదలైంది. గ్రాండ్ లాంఛ్ కార్యక్రమం ప్రసారాలు శనివారం సాయంత్రం 6 గం.ల నుంచి ప్రారంభంకానుంది. ఈ సారి 24 గంటల ఎంటర్ టైన్మెంట్ తో ఓటీటీలో ఈ ఫో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మొత్తం 17 మంది కంటెస్టెంట్ లు పాల్గొంటున్నారు. 85 జరిగే నాన్ స్టాప్ బిగ్బాస్ ఓటీటీ హంగామా ఎలా వుండబోతోంది అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది.

ఈసారి బిగ్ బాస్ హౌస్ చాలా ప్రత్యేకంగా ఉంది. గత బిగ్ బాస్ హౌస్‌లతో పోలిస్తే ఈసారి చాలా సుందరంగా బిగ్ బాస్ హౌస్ ను ముస్తాబు చేశారు. హౌస్ లోకి ఈసారి ముమైత్ ఖాన్ – అఖిల్ సార్థక్ – అషురెడ్డి – హమీదా – సరయు – అరియానా గ్లోరీ -మహేష్ విట్టా – యంకర్ స్రవంతి చొక్కారపు – ఆర్జే చైతూ – యాంకర్ శివ – అనిల్ రాథోడ్ – మిత్ర శర్మ –  బిందు మాధవి -అజయ్  ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. షో స్టార్ట్ అవ్వగానే అందమైన అమ్మాయిలతో నాగార్జున ఎంట్రీ అదరగొట్టారు. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందొ పరిచయం చేశారు.. ఆతర్వాత ఒకొక్కరిని స్టేజ్ పైకి పిలిచారు. ఇక బిగ్ బాస్ ఓటీటీలో వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ అనే టాక్స్ ఇచ్చాడు ఇందులో వారియర్స్ గా గత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఉండగా ఛాలెంజర్స్ గా కొత్తవారిని తీసుకున్నారు. వీరి మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. ఈసారి హౌస్‌లో ఎలాంటి గొడవలు అల్లర్లు, లవ్ ట్రాక్ లు జరుగుతాయో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiara Advani And Siddharth: త్వరలో ఏడడుగులు నడవబోతున్న మరో ప్రేమజంట!.. కియారా, సిద్ధార్థల పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్‌!

Bigg Boss Non-Stop Grand Launch Highlights: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్.. మరోసారి అదరగొట్టిన నాగ్

Samyuktha Menon: ఛార్మినార్ వద్ద సందడి చేసిన భీమ్లా నాయక్ హీరోయిన్… వైరల్ అవుతున్న ‘సంయుక్త’ ఫొటోస్..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Feb 2022 08:40 PM (IST)

    కంటెస్టెంట్స్ అందరు హౌస్‌లోకి వచ్చేశారు..

    17 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించాడు నాగార్జున.. ఇక పై నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలిపారు నాగార్జున.. హౌస్ మెంట్స్ ను లోపల ఉంచి హౌస్ కు తాళం వేశారు నాగ్.

  • 26 Feb 2022 08:35 PM (IST)

    చివరిగా 17వ కంటెస్టెంట్‌గా అఖిల్ సార్ధక ఎంట్రీ ఇచ్చాడు..

    సీజన్ 4 లో అఖిల్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ఈసారి సింగర్ గా మారిపోయాడు అఖిల్. గతంలో భయం ఉండేది.. ఇప్పుడు భయం పోయిందని తెలిపాడు అఖిల్. ఈ సారి ఎలా అయినా కప్ గెలవాలని నాగార్జున చెప్పాడు. అఖిల్ కూడా ఈసారి ఎలాగైనా కప్పు గెలుచుకుంటా అని చెప్పుకొచ్చాడు..

  • 26 Feb 2022 08:25 PM (IST)

    16 వ కంటెస్టెంట్‌గా హమీద

    బిగ్ బాస్ సీజన్ 5 లో పాటిస్పెట్ గా ఎంట్రీ ఇచ్చిన హమీద.. మరోసారి బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. గత సీజన్ లో నాగార్జున గిఫ్ట్ గా ఇచ్చిన షర్ట్ వేసుకొని ఎంట్రీ ఇచ్చింది హమీద. బిగ్ బాస్ తర్వాత లైఫ్ చాలా మ్యాజికల్ గా మారిందని చెప్పుకొచ్చింది హమీద. హామీదకు టాస్క్ ఇచ్చాడు నాగార్జున..ఓ ఐదు కళ్ళను చూపించి ఏ కళ్ళు నచ్చాయో చెప్పమన్నాడు నాగార్జున.

  • 26 Feb 2022 08:16 PM (IST)

    15వ కంటెస్టెంట్ గా తెలుగమ్మాయి భిందుమాధవి. 

    15 వ కంటెస్టెంట్ గా హీరోయిన్ గా బిందు మాధవి ఎంట్రీ ఇచ్చింది. భిందుమాధవి హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. తమిళ్  బిగ్ బాస్ లో పాటిస్పెట్ గా చేసింది భిందుమాధవి. తెలుగు ప్రజలకు దగ్గరవడానికి బిగ్ బాస్ కు వచ్చానని చెప్పింది భిందుమాధవి.

  • 26 Feb 2022 08:11 PM (IST)

    14వ కంటెస్టెంట్ గా యాంకర్ శివ..

    ముందుగా యాంకర్ శివ వీడియో చూపించారు. శివ సోషల్ మీడియాలో యాంకర్ గా చిన్న చిన్న సోషల్ మీడియా సెలబ్రెటీస్ ను ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అయ్యాడు.

  • 26 Feb 2022 07:59 PM (IST)

    13వ కంటెస్టెంట్‌గా 7 ఆర్ట్స్ సరయు..

    వారియర్స్ తరపున 7 ఆర్ట్స్ సరయు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  హౌస్ లోకి వచ్చిన 13వ కంటెస్టెంట్ సరయు. గత బిగ్ బాస్ లో ఒక వారం మాత్రమే ఉంది సరయు.. ఇప్పుడు తనకు వచ్చిన రెండో అవకాశం తప్పకుండా వాడుకుంటా అని చెప్పింది సరయు.

  • 26 Feb 2022 07:52 PM (IST)

    12 వ కంటెస్టెంట్‌గా తేజస్వి ఎంట్రీ ఇచ్చింది..

    పాత తేజస్వి కాస్త ఎదిగి తిరిగి మీముందుకు వచ్చాను అని చెప్పింది. ఈ సారి మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తా అంటుంది. కొన్ని పాటలను ప్లే చేసి వాటి హుక్ స్టెప్స్ వేయమని చెప్పాడు నాగ్ . తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది తేజస్వి.

  • 26 Feb 2022 07:45 PM (IST)

    11వ కంటెస్టెంట్ గా యంగ్ హీరోయిన్ మిత్ర శర్మ

    బిగ్ బాస్ వల్ల తెలుగువాళ్ళకు మరింత దగ్గర అవుతా అని చెప్పుకొచ్చింది ముంబై భామ మిత్ర. హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఆతర్వాత ప్రొడక్షన్ హౌస్ పెట్టా అని చెప్పింది మిత్ర.

  • 26 Feb 2022 07:37 PM (IST)

    10వ కంటెస్టెంట్ గా మోడల్ అనిల్..

    10వ కంటెస్టెంట్ గా మోడల్ అనిల్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు.. అక్కడ కొన్ని లిప్ మర్క్స్ ఇచ్చి వాటిలో ఒకటి సెలక్ట్ చేసుకోమన్నాడు నాగార్జున.. ఒకటి సెలక్ట్ చేసుకున్న తర్వాత హౌస్ లో ఉన్న వారిలో ఒకరి లిప్ మార్క్ అది ఎవరిదో కనిపెట్టాలని చెప్పాడు నాగార్జున.

  • 26 Feb 2022 07:30 PM (IST)

    బిగ్ బాస్ నాకు డైమండ్‌లాంటిది : శ్రీ రాపాక

    బిగ్ బాస్ తనకు డైమండ్ తో సమానం అని చెప్పింది శ్రీ రాపాక.. తన ఫ్యామిలీ మెంబర్స్ తాను బిగ్ బాస్ లోకి వెళ్లాలని దేవుడిని కోరుకున్నారని చెప్పింది.

  • 26 Feb 2022 07:27 PM (IST)

    తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ రాపాక

    తొమ్మిదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రీ రాపాక. ఆర్జీవీ తెరకెక్కించిన నగ్నం సినిమాతో ఈ అమ్మడు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

  • 26 Feb 2022 07:21 PM (IST)

    ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు నటరాజ్ మాస్టర్..

    వారియర్స్ టీమ్ నుంచి కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ముందుగా నటరాజ్ గురించి ఓ వీడియోను చూపించారు.. ఈవీడియోలో తాను తిరిగి సింహంలా ఎంట్రీ ఇవ్వనున్నానని చెప్పుకొచ్చారు నటరాజ్. ఇంతకు ముందు భార్య కోసం వచ్చాను.. ఇప్పుడు తన పాప కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. నటరాజ్ కు తన పాప ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చారు నాగ్.

  • 26 Feb 2022 07:16 PM (IST)

    అరియానాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు హౌస్ మేట్స్..

    బిగ్ బాస్ హౌ స్ లోకి వెళ్లి చాలా ఎగ్జైట్ అయ్యింది అరియానా.. హౌస్ చూసి తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్టుందని చెప్పుకొచ్చింది అరియానా..

  • 26 Feb 2022 07:14 PM (IST)

    ఏడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అరియనా..

    బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ పూర్తిగా చేంజ్ అయ్యిందని చెప్పుకొచ్చింది అరియనా.. ఈసారి ఖచ్చితంగా గెలుస్తా అని ధీమా వ్యక్తం చేసింది అరియనా.. అలాగే అరియనా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు నాగార్జున.. దానికి చాలా మంది ఉన్నారు ఇప్పుడు చెప్పలేను అని తప్పించుకుంది. డేర్ డెవిల్ గా బిగ్ బాస్ హౌస్ లో అదరగొడతాని చెప్పింది అరియనా..

  • 26 Feb 2022 07:09 PM (IST)

    ఆరో కంటెస్టెంట్‌గా ఆర్.జే చైతూ..

    బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్.జే చైతూ.. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాడు చైతూ.. చైతూ కోసం వాళ్ళ అమ్మగారు స్టేజ్ పైకి వచ్చారు. కొడుకు వల్ల తన ఫ్యావరెట్ హీరో నాగార్జునను కలిసాను అని అన్నారు చైతూ తల్లి.

  • 26 Feb 2022 06:57 PM (IST)

    స్రవంతికి  సర్ ప్రైజ్ వీడియో చూపించిన నాగార్జున

    స్రవంతికి  సర్ ప్రైజ్ వీడియో చూపించాడు నాగార్జున.. తన భర్త వీడియోను ప్లే చేశారు. నీ గేమ్ నువ్వు ఆడు ఖచ్చితంగా విన్ అవుతావని తన భర్త , కొడుకు స్రవంతికి సపోర్ట్ చేశారు.. ఇక బిగ్ బాస్ హౌస్ లో నవరసాలు పండించి ఆకట్టుకుంటానని చెప్పుకొచ్చింది స్రవంతి

  • 26 Feb 2022 06:53 PM (IST)

    ఐదో కంటెస్టెంట్ గా స్రవంతి..

    ఐదో కంటెస్టెంట్ గా ఛాలెంజర్ టీమ్ నుంచి ఎంట్రీ ఇచ్చింది. అందమైన పాటతో ఆకట్టుకుంది యాంకర్ స్రవంతి.. ఖచ్చితంగా బిగ్ బాస్ లో లేడీ విన్నర్ అవుతా అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.. ఎవరికీ తెలియని సీక్రెట్  ఒకటి చెప్పమని నాగ్ అడగగా .. తనకు రెండు సార్లు పెళ్లయిందని చెప్పి షాక్ ఇచ్చింది. ముందు ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నా అని.. ఆతర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారని చెప్పుకొచ్చింది స్రవంతి.

  • 26 Feb 2022 06:47 PM (IST)

    ఇల్లు చూసి షాక్ అయిన అజయ్..

    బిగ్ బాస్ ఓ లెటర్ పంపాడు.. రాబోతున్న ఛాలెంజర్స్ ను ఆటపట్టించాలని చెప్పాడు బిగ్ బాస్. అజయ్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ముమైత్, అషు, మహేష్ ముగ్గురు వెల్కమ్ చెప్పారు..  ఇల్లు చూసి షాక్ అయ్యాడు అజయ్..

  • 26 Feb 2022 06:44 PM (IST)

    నాలుగో కంటెస్టెంట్‌గా ఛాలెంజర్ కొత్త కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు..

    ఛాలెంజర్‌గా కొత్త కుర్రాడు అజయ్.. ఇతడు ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు.. ఇప్పుడు ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.. అందులో హీరోగానూ అతడే నటిస్తున్నాడు. ఈ బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ నాకు చాలా ప్లస్ అవుతుందని తెలిపాడు అజయ్.. సంకీగా ( మొండిగా )దూసుకుపోతా అని చెప్పుకొచ్చాడు అజయ్

  • 26 Feb 2022 06:38 PM (IST)

    ముమైత్‌కు హౌస్‌లోకి వెల్కమ్ చెప్పిన అషు..

    ముమైత్ కు హౌస్‌లోకి వెల్కమ్ చెప్పింది అషు రెడ్డి.. మహేష్ విట్టా.. అషు ఇద్దరూ ముమైత్ కు వెల్కమ్ చెప్పి హౌస్ చూపించారు..

  • 26 Feb 2022 06:36 PM (IST)

    నాగార్జునను చూసి తెలుగు మర్చిపోయానన్న ముమైత్

    వచ్చి రాని తెలుగులో మాలాడుతూ ఆకట్టుకుంది ముమైత్.. మరోసారి బిగ్ బాస్ లోకి రావడంతో బాగా ఎగ్జైట్ అయ్యింది ముమైత్.. బిగ్ బాస్ ముందుకంటే ఒకలా ఉన్నా.. ఆతర్వాత ఇంకోలా ఉన్నా అని చెప్పుకొచ్చింది ముమైత్.. ముమైత్ లో ప్రేమ ఎంత ఉంది.. కెరీరింగ్ ఎంత ఉంది.. కోపం ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు నాగ్.. ఈ సీజన్ లో ముమైత్ డైనమైట్ లా పర్ఫామ్ చేయనుంది..

  • 26 Feb 2022 06:32 PM (IST)

    మూడో కంటెస్టెంట్ గా ముమైత్ ఖాన్

    మూడో కంటెస్టెంట్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్.. మరోసారి తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది ముమైత్ ..

  • 26 Feb 2022 06:28 PM (IST)

    ఈసారి కప్పు కొడతా : మహేష్ విట్టా

    24/7 బిగ్ బాస్ హౌస్ లో ఊర మాస్ గా ఉంటానని అన్నాడు మహేష్ విట్టా.. హౌస్ లోపలికి వెళ్ళగానే అషు మహేష్ కు వెల్కమ్ చెప్పింది.. ఆతర్వాత ఇల్లంతా తిప్పి చూపించింది అషు..

  • 26 Feb 2022 06:25 PM (IST)

    రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ విట్టా

    రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ విట్టా.. ముందుగా మహేష్ జర్నీని చూపించారు. మెగాస్టార్ సినిమాలు చూస్తూ ఆయన పాటలు వింటూ సినిమాల పై ఆసక్తి కలిగింది.. ఆసమయంలో బిగ్ బాస్ వాళ్ళ మెగాస్టార్ ను కలిసాను అన్నాడు మహేష్ విట్టా.. పాత మహేష్ కు ఇప్పుడు మహేష్ కు చాలా తేడా ఉంటుంది అన్నారు మహేష్ విట్టా..

  • 26 Feb 2022 06:21 PM (IST)

    హౌస్ నెక్స్ట్ లెవల్‌‌లో ఉంది : అషు రెడ్డి

    మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి.. ఇల్లంతా కలియ తిరిగింది.. హౌస్ చూస్తూ చాలా ఎగ్జైట్ అయ్యింది ఈ వయ్యారి భామ..

  • 26 Feb 2022 06:20 PM (IST)

    నాగ్ కు ముద్దిచ్చిన అషు రెడ్డి..

    కింగ్ నాగార్జున కు ముద్దు పెట్టింది అషు రెడ్డి.. అషు ఆట ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేసింది ఈ అందాల భామ

  • 26 Feb 2022 06:18 PM (IST)

    నాగార్జునకు మూడు రోజాపూలు ఇచ్చిన అషు రెడ్డి

    నాగ్ కు మూడు రోజాపూలు ఇచ్చింది అందాల అషు.. నాగార్జున మోటివేట్ చేసినందుకు నాగ్ కు ఒక రోజా పువ్వు, మూడో సీజన్ బిగ్ బాస్ కు ఒకటి నాన్ స్టాప్ బిగ్ బాస్ కు ఒక పువ్వు అంటూ చెప్పుకొచ్చింది అషు..

  • 26 Feb 2022 06:16 PM (IST)

    వారియర్స్ వెర్సెస్ ఛాలెంజర్స్

    ఈసారి వారియర్స్ వెర్సెస్ ఛాలెంజర్స్ అనే పోటీ పెట్టనున్నారు బిగ్ బాస్.. వారియర్స్ అంటే గత సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్.. ఛాలెంజర్స్ అంటే కొత్తగా రానున్న కంటెస్టెంట్స్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పారు నాగ్

  • 26 Feb 2022 06:14 PM (IST)

    ముందుగా ఎంట్రీ ఇచ్చింది అషూ రెడ్డి..

    ముందుగా ఎంట్రీ ఇచ్చింది అషూ రెడ్డి.. పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ.. సాంగ్ తో అదరగొట్టింది అషు రెడ్డి..

  • 26 Feb 2022 06:10 PM (IST)

    బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరిగి చూసిన నాగ్

    బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరిగి చూస్తూ.. ఎక్కడ ఏమేమి ఉన్నాయని ప్రేక్షకులకు వివరించారు నాగార్జున. బిగ్ బాస్ తో మాట్లాడిన నాగార్జున.. నాగ్ ను స్టేజ్ పైకి వెళ్ళమని చెప్పిన బిగ్ బాస్

  • 26 Feb 2022 06:08 PM (IST)

    అందమైన అమ్మాయిలతో ఎంట్రీ ఇచ్చిన నాగ్..

    అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున.. ముందుగా హౌస్ లోకి వచ్చి ప్రేక్షకుల హౌస్ లా ఉంటుందో చూపించారు.

Published On - Feb 26,2022 6:05 PM

Follow us