Kiara Advani And Siddharth: త్వరలో ఏడడుగులు నడవబోతున్న మరో ప్రేమజంట!.. కియారా, సిద్ధార్థల పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్‌!

కార్గిల్‌ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'షేర్షా'. ఈ సినిమాలో వీరజవాన్‌ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) నటించగా

Kiara Advani And Siddharth: త్వరలో ఏడడుగులు నడవబోతున్న మరో ప్రేమజంట!.. కియారా, సిద్ధార్థల పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్‌!
Kiara Advani
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 26, 2022 | 7:57 PM

కార్గిల్‌ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షేర్షా’. ఈ సినిమాలో వీరజవాన్‌ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) నటించగా.. అతని ప్రేయసి డింపుల్ క్యారెక్టర్‌లో కియారా అద్వానీ (Kiara Advani) అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. సిల్వర్‌ స్ట్ర్కీన్‌పై ప్రేమికులుగా మెప్పించిన వీరు నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ‘షేర్షా’ సినిమాకు ముందు నుంచే వీరు చెట్టపట్టాలేసుకుని తిరిగిన వీరి ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఇద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌, ట్రిప్‌ లకి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుని తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. ఇక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. ఈక్రమంలో త్వరలోనే వీరు పెళ్లిపీటలెక్కనున్నారన్న వార్తలు బాలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి.

కాగా ఇప్పటివరకు తమ రిలేషన్‌పై అటు సిద్ధార్థ్‌ కానీ, కియారా గానీ నోరు విప్పలేదు. అయితే వీరి ప్రేమను ఇరు పెద్దలు ఆశీర్వదించారని, పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. 2022 మధ్యలో, లేదా ఏడాది చివరలో ఏడడుగులు నడిచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారట ఈ ప్రేమ పక్షులు. ఇక విక్కీ కౌశల్‌- కత్రినా కైఫ్‌ తరహాలోనే సిద్ధార్థ్‌- కియారాలు కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుపుకోవాలనుకుంటున్నారట. మరి తమ ప్రేమ, పెళ్లి వార్తలపై కియారా-సిద్ధార్థ్‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న ‘RC15 ‘ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నటిస్తోంది కియారా. దీంతో పాటు భూల్‌ భూలయ్యా2’ , గోవిందా నామ్‌ మేరా, జుగ్ జుగ్‌ జీయో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. వీటితో పాటు టాలీవుడ్ రౌడీ విజయ్‌ దేవరకొండతోనూ సిల్వర్‌ స్ర్కీన్‌ చేసుకోనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Russia Ukraine Crisis: నేను సెంట్రల్‌ కీవ్‌ లోనే ఉన్నాను.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు..

Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్‌ వార్‌ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?

Viral Video: కంగారూతో మాములుగా ఉండదు మరి.. పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే.. అంతేగా..