Russia – Ukraine Conflict: భూతల స్వర్గంగా ఉండే ఉక్రెయిన్ స్మశానంలా మారిపోయింది.. నాడు-నేడు ఉక్రెయిన్ పరిస్థితి..
Russia - Ukraine Conflict: ఉక్రెయిన్, భూతల స్వర్గాన్ని తలపించే దేశం ఇది. ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ప్రాచీన కట్టడాలకు నెలవైన ఉక్రెయిన్..
Russia – Ukraine Conflict: ఉక్రెయిన్, భూతల స్వర్గాన్ని తలపించే దేశం ఇది. ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ప్రాచీన కట్టడాలకు నెలవైన ఉక్రెయిన్.. ఇప్పుడు రష్యా ఎటాక్స్‌తో కకావికలమవుతోంది. ఎక్కడ చూసినా విధ్వంసమే. ఎటుచూసినా ఆర్తనాదాలే. ఇల వైకుంఠపురాన్ని తలపించే ఉక్రెయిన్, ఇప్పుడు నరకాన్ని తలపిస్తోంది. ఎంతో సంతోషంగా జీవించే ప్రజలంతా తలోదిక్కుకు పారిపోయి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
కీవ్.. ఉక్రెయిన్ రాజధాని. ఎంతో అందమైన నగరం. సినిమా షూటింగ్‌లకు స్వర్గధామం ఈ సిటీ. కానీ, కీవ్ ఇప్పుడు బాంబుల వర్షంతో విలవిలలాడుతోంది. మొన్నటివరకు ఎంతో సంతోషంగా గడిపిన కీవ్ ప్రజలు, ఇప్పుడు బంకర్లలో తలదాచుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇక చెర్నోబిల్, ఒకప్పటి రష్యాకు అణుస్థావరం ఈ నగరం. పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే చెర్నోబిల్‌లో ఇప్పుడు విధ్వంసం రాజ్యమేలుతోంది.
ఉక్రెయిన్‌లో దేని అందం దానిదే. ప్రతీ నగరం ప్రత్యేకమైదే, అలాంటి సిటీల్లో ఒకటి మారిపోల్. అలాంటి, అందమైన నగరంలో బాంబులతో విరుచుకుపడింది రష్యా. కేవలం మూడే మూడు రోజుల్లో మారిపోల్ నగరం స్వరూపమే మారిపోయింది. రష్యా బోర్డర్‌లో ఉండే మరో అందమైన నగరం లుహాన్స్. సమీపంలో ఉండటంతో ఈ నగరంపైనే ఎక్కువ ఎటాక్స్ చేసింది రష్యా. దాంతో లుహాన్స్ సిటీ అల్లకల్లోలంగా మారింది. ఇక ఒడెషా, ఉక్రెయిన్ ఆయుధ సంపదకు నెలవైన సిటీ. ఆర్టిలరీ పార్క్ లాంటి కీలకమైన సైనిక స్థావరం ఇక్కడుంది. అందుకే, మెయిన్ టార్గెట్‌లో ఇది కూడా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఉక్రెయిన్‌ను దెబ్బ కొట్టేందుకు ఒడెషాపై రష్యా విరుచుకుపడింది. దాంతో, ప్రాణాలు కాపాడుకోవడానికి తలోదిక్కుకు పారిపోయారు ప్రజలు.
Also read:
Bigg Boss Non-Stop: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ షురూ.. బిగ్ బాస్ ఓటీటీ హంగామా మొదలైంది.