Rishi Sunak: బ్రిటన్ పార్లమెంట్‌లో రిషి సునాక్ మార్క్.. ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా జవాబు..

ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా బ్రిటన్‌ పార్లమెంటుకు వచ్చారు రిషి సునాక్‌.. తొలిరోజే ప్రతిపక్షం నుంచి సవాలు ఎదురైంది. భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్మన్‌ ఇటీవలి వరకూ లిజ్‌ట్రస్‌ క్యాబినెట్‌లో హోంమంత్రిగా ఉన్నారు.

Rishi Sunak: బ్రిటన్ పార్లమెంట్‌లో రిషి సునాక్ మార్క్.. ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా జవాబు..
Rishi Sunak
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 27, 2022 | 8:15 AM

ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా బ్రిటన్‌ పార్లమెంటుకు వచ్చారు రిషి సునాక్‌.. తొలిరోజే ప్రతిపక్షం నుంచి సవాలు ఎదురైంది. భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్మన్‌ ఇటీవలి వరకూ లిజ్‌ట్రస్‌ క్యాబినెట్‌లో హోంమంత్రిగా ఉన్నారు. తన శాఖకు చెందిన రహస్య పత్రాలను పంపేందుకు అనుకోకుండా తన ప్రయివేటు ఇమెయిల్‌ అకౌంట్‌ ఉపయోగించినందుకు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే రిషి సునాక్‌ తన క్యాబినెట్‌లో తిరిగి ఆమెకు హోంమంత్రి పదవిని అప్పగించారు. తప్పు చేసిన బ్రేవర్మన్‌.. తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకొని, తిరిగి హోంమంత్రి పదవి ఎలా అప్పగిస్తారని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విమర్శలు గుప్పించింది.

కాగా.. రిషి సునాక్‌ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. నేరస్థులపై ఉక్కుపాదం మోపడంతోపాటు దేశ సరిహద్దులను రక్షించుకోవడంపై హోంశాఖ మంత్రి దృష్టి సారిస్తారని ధీటుగా సమాధానం చెప్పారు.. జరిగిన పొరపాటును సువెల్లా బ్రేవర్మన్‌ స్వయంగా వెల్లడించడంతో పాటు తప్పును కూడా అంగీకరించారని గుర్తు చేశారు రిషి సునాక్‌.. సువెల్లా బ్రేవర్మన్‌ కొద్ది రోజుల క్రితం భారతీయులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

వీసా కాలపరిమితి మించి బ్రిటన్‌లో ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులని సువెల్లా బ్రేవర్మన్‌ చేసిన వ్యాఖ్యలు పేర్కొనడం విదేశాంగశాఖను ఇబ్బందికి గురి చేశాయి. అయితే.. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీ కన్సర్వేటివ్స్‌ నాయుకులు కూడా తప్పు పట్టారు.. లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేసిన తర్వాత ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో సువెల్లా బ్రేవర్మన్‌ తన మద్దతును రిషి సునాక్‌కే ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..