PM Modi Australia Visit: ప్రధాని మోడీని కలవడం గొప్ప అనుభూతి.. ఆస్ట్రేలియా ప్రముఖుల ఆసక్తికర వ్యాఖ్యలు..
PM Modi Australia Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటన బిజిబిజీగా కొనసాగుతోంది. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ పాపువా న్యూ గినివాలో పర్యటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.
PM Modi Australia Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటన బిజిబిజీగా కొనసాగుతోంది. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ పాపువా న్యూ గినివాలో పర్యటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక సమావేశాలలో పాల్గొననున్నారు. ప్రవాసులతో సమావేశం.. ద్వైపాక్షిక చర్చలు, పలు కీలక సంస్థల ప్రతినిధులతో భేటిలు నిర్వహిస్తున్నారు. భారత్ లో పెట్టుబడులే లక్ష్యంగా పలు కీలక సంస్థలకు చెందిన సీఈఓలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇంధనం, ఆర్థిక వృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఇలా పలు కీలక విషయాలపై ప్రధాని మోడీ చర్చిస్తున్నారు. దీంతోపాటు, కంపెనీల పెట్టుబడులు, పర్యావరణం తదితర విషయాలపై కూడా చర్చించారు.
మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకు చెందిన గ్రీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ సంస్థ ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ తో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త జాన్ ఆండ్రూ హెన్రీ ఫారెస్ట్ AO, (ట్విగ్గీ) తో పలు విషయాలపై చర్చించారు. ఆయన ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ (FMG), మాజీ CEO (మరియు ప్రస్తుత నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్)గా, బిజినెస్‌మెన్ గా ప్రసిద్ధి చెందారు. ఆయనతోపాటు పలు కంపెనీల సీఈఓలతో, పలువురు ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Showcasing investment potential of India. PM Narendra Modi held a conversation with Paul Schroder, Chief Executive, AustralianSuper in Sydney. Pitching India among the top investment destinations in the world, PM invited AustralianSuper to partner in India’s growth story: MEA… pic.twitter.com/B86DQ0ySbl
— ANI (@ANI) May 23, 2023
సిడ్నీలో ఆస్ట్రేలియన్ సూపర్ సీఈవో పాల్ ష్రోడర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. అత్యంత ఆకర్షణీయమైన సమావేశం, ప్రధానమంత్రి వ్యాపారాన్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. భారతదేశం కోసం తన కలలు, నీతి గురించి మాట్లాడారు. ఇది నిజంగా శక్తివంతమైన సందేశం” అని పాల్ ష్రోడర్ చెప్పారు.
#WATCH | Prime Minister Narendra Modi meets Paul Schroder, CEO of Australian Super, in Sydney pic.twitter.com/N1iVohs9St
— ANI (@ANI) May 23, 2023
నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ఆస్ట్రేలియా ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. పలు సృజనాత్మక విషయాలు, పలు విషయాల గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారని.. భారతదేశం – ఆస్ట్రేలియా ఎలా మెరుగుపడతాయన్న విషయాలను పంచుకున్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని కలకవడం తమ అదృష్టమంటూ పేర్కొన్నారు.
Fostering India-Australia collaboration in mining and minerals sector. PM Narendra Modi held a meeting with Georgina Hope Rinehart, Executive Chairman of Hancock Prospecting Group, Roy Hill and S. Kidman & Co, in Sydney: MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/NY8fhUpUii
— ANI (@ANI) May 23, 2023
‘‘ముఖ్యంగా యూనివర్సిటీలో సృజనాత్మక విషయాలను ప్రోత్సహిస్తూ భారతదేశం, ఆస్ట్రేలియాలు ఎలా మెరుగ్గా పని చేయవచ్చనే దాని గురించి మేము చాలా మాట్లాడాము. ఆయన ఖచ్చితంగా తనకంటూ ఒక క్రియేటివ్ ఎలిమెంట్‌ని కలిగి ఉన్నారు. కళలో, సాంస్కృతికంగా రెండు దేశాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి..’’ – ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత ప్రముఖ కళాకారుడు డేనియల్ మేట్
#WATCH | “We talked a lot about how India and Australia could work better, encouraging creative subjects, particularly in University. He definitely has a creative element to himself…I think there are a lot of cultural crossovers in art as well as just culturally. There are a… pic.twitter.com/aBdJNtfQL0
— ANI (@ANI) May 23, 2023
‘‘ప్రపంచ స్థాయిలో భారతదేశం సామర్ధ్యం అధిక స్థాయికి చేరుకుంది, ఎందుకంటే భారతదేశం సైన్స్, శాస్త్రవేత్తలకు పరికరాలను అందిస్తోంది. సామర్థ్యాన్ని అందించడానికి పెట్టుబడి పెడుతోంది. ప్రధాని మోదీ ఖచ్చితంగా గొప్ప వ్యక్తి.. గొప్ప నాయకులు..’’ అని ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత నోబెల్ గ్రహీత బ్రియాన్ పాల్ ష్మిత్ అన్నారు.
#WATCH | “…India’s ability to do world-class Science has become just an order of magnitude higher because India is investing in its Science and scientists to give them equipment and the ability to ask questions on the edge. PM Modi is certainly one of the most visible leaders… pic.twitter.com/QEs2OW6Mn7
— ANI (@ANI) May 23, 2023
‘‘ప్రధానమంత్రి మంచి అపురూపమైన వ్యక్తి. ఆయనను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, దేశం, దృక్పథం పట్ల ఆయనకు నిజంగా శ్రద్ధ ఉందని నేను గమనించా.. ప్రధానమంత్రి ఒక అద్భుతమైన ప్రభావశీలి.. ఇలాంటి నాయకులే అద్భుతమైన పనులు చేస్తారు.” అని సెలబ్రిటీ చెఫ్ & రెస్టారెంట్ సారా టాడ్ చెప్పారు.
#WATCH | “The Prime Minister is such an incredible man. I feel very lucky to have met him and I can see that he really cares about the country and the vision. The PM is an incredible influencer and I think coming from humble beginnings and standing up as this leader in the… pic.twitter.com/hKRug12D7B
— ANI (@ANI) May 23, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..