Nigeria Plane Crash: కిడ్నాప్ కు గురైనవారి రక్షణ చర్యలకు వెళ్తూ, నైజీరియాలో కూలిన విమానం, ఏడుగురి మృతి
Nigeria Plane Crash: నైజీరియా రాజధాని అబూజాలో ఆదివారం ఓ సైనిక విమానం కూలిపోగా అందులోని ఏడుగురూ మృతి చెందారు. అబూజా శివార్లలోని ఓ స్కూలు నుంచి కిడ్నాప్ కు గురైన పిల్లలు..

Nigeria Plane Crash: నైజీరియా రాజధాని అబూజాలో ఆదివారం ఓ సైనిక విమానం కూలిపోగా అందులోని ఏడుగురూ మృతి చెందారు. అబూజా శివార్లలోని ఓ స్కూలు నుంచి కిడ్నాప్ కు గురైన పిల్లలు, టీచర్లను దుండగుల బారి నుంచి రక్షించేందుకు ఈ విమానం సర్వే కోసం బయలుదేరి ప్రమాదానికి గురైంది. కిడ్నాపర్లు ఈ స్కూలుకు చెందిన ఓ విద్యార్థిని హతమార్చి.. మొత్తం 42 మందిని అపహరించుకుపోయారు. వీరిలో 27 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు, స్కూలు సిబ్బంది బంధువులు ఉన్నారు. ఈ సామూహిక కిడ్నాపింగ్ ఘటనపై నైజీరియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బందీలుగా దుండగుల చెరలో ఉన్నవారిని రక్షించాలని పోలీసులను, సైన్యాన్ని అధ్యక్షుడు బుహారీ ఆదేశించారు.
ఈ ‘మిషన్’ కు వెళ్తూ సైనిక విమానం కూలిపోయింది. ఇంజన్ వైఫల్యమే దీనికి కారణమని పైలట్ చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఇది కూలిన ప్రదేశంలో మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు శ్రమించాయి. విమాన ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నైజీరియాలో దుండగులు తమ డిమాండ్లను తీర్చుకునేందుకు, ప్రభుత్వాన్ని బెదిరించడానికి అమాయకులైన విద్యార్థులను, ప్రజలను కిడ్నాప్ చేస్తున్న సంఘటనలు పరిపాటి అయ్యాయి.
Also Read:
అమెరికాలో కరోనా మరణ మృదంగం, 5 లక్షలకు చేరువలో మృతులసంఖ్య, నిపుణుల ఆందోళన