అమెరికాలో కరోనా మరణ మృదంగం, 5 లక్షలకు చేరువలో మృతులసంఖ్య, నిపుణుల ఆందోళన

అమెరికాలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది.  ఈ పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వైరస్ తో మరణించిన వారి సంఖ్య దాదాపు 5 లక్షలకు చేరుతోంది..

  • Umakanth Rao
  • Publish Date - 4:30 pm, Mon, 22 February 21
అమెరికాలో కరోనా మరణ మృదంగం, 5 లక్షలకు చేరువలో మృతులసంఖ్య, నిపుణుల ఆందోళన

అమెరికాలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది.  ఈ పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వైరస్ తో మరణించిన వారి సంఖ్య దాదాపు 5 లక్షలకు చేరుతోంది. ఇది ‘టెర్రిబుల్’ అని అధ్యక్షుడు జోబైడెన్ కి  చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫోసీ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరాంతం వరకు కూడా దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితి ఏర్పడకపోవచ్చునని ఆయన అన్నారు. వివిధ రకాల వ్యాక్సిన్లు వస్తున్నాయని, ఇన్ఫెక్షన్లు తగ్గుతున్నా మరణాలు  పెరుగుతూనే ఉండడం దారుణమని పేర్కొన్నారు. ఇది ‘హిస్టారిక్’.. వంద సంవత్సరాల్లో ఈ విధమైన పరిస్థితిని చూడలేదు’ అన్నారు. 1918 లో ఇన్ ఫ్లూయెంజా సృష్టించిన ‘బీభత్సాన్ని’ ఆయన గుర్తు చేశారు. దేశంలో ఇప్పటివరకు సుమారు 498,000 మంది మృత్యు వాత పడినట్టు జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.

తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మొత్తం 100 మిలియన్ల మందికి రోజుకు 10 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని అధ్యక్షుడు బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికాలో 61 మిలియన్లకు పైగా ప్రజలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా వారం  రోజులుగా దేశాన్ని వణికిస్తున్న మంచు తుపాను కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ టెక్సాస్ రాష్ట్రంలో కొని వేల ఇళ్లకు విద్యుత్, నీటి సౌకర్యం లేదని తెలుస్తోంది. వీటిని పునరుధ్ధరించేందుకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు అనేకమంది ముందుకు రావడంలేదు.

Also Read:

Breaking News: ముంబైలో ఎంపీ ఆత్మహత్య.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

బీజేపీకి ఎందుకు ఓటేయాలి..? కంపెనీలు ప్రైవేటుకు కట్టబెట్టినందుకా.. ఉద్యోగాలు ఊడగొట్టినందుకా..?