కోటి వృక్షార్చనకు అపూర్వ గౌరవం.. “విశ్వగురు వరల్డ్ రికార్డ్స్” పురస్కారం అందుకున్న గ్రీన్‌ ఛాలెంజ్‌ టీం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో నిర్వహించిన..

  • K Sammaiah
  • Publish Date - 4:49 pm, Mon, 22 February 21
కోటి వృక్షార్చనకు అపూర్వ గౌరవం..  “విశ్వగురు వరల్డ్ రికార్డ్స్” పురస్కారం అందుకున్న గ్రీన్‌ ఛాలెంజ్‌ టీం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో నిర్వహించిన “కోటి వృక్షార్చన”కు అపూర్వ గౌరవం దక్కింది. ఒక్క రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డులు క్రియేట్ చేసింది. “విశ్వగురు వరల్డ్ రికార్డ్స్” లో కోటి వృక్షార్చనకు స్థానం దక్కింది.

సమాజానికి ఉపయోగపడే అద్వితీయమైన కార్యక్రమాలను గుర్తించి తన రికార్డ్స్ లో స్థానం కల్పించే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ కోటి వృక్షార్చనకు తామిచ్చే గుర్తింపు “చంద్రునికో నూలుపోగు” మాత్రమేనని కీర్తించింది.ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను సంస్థ అభినందించింది.

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” రేపటి తరం కోసం చేస్తున్న నిస్వార్ధమైన కార్యక్రమంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. ఇది మరింత ముందుకు సాగాలని అభిలాషించింది.

Read more:

గులాబీ పార్టీకి సీనియర్‌ నేత గుడ్‌బై.. వైయస్‌ షర్మిల పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటన