గులాబీ పార్టీకి సీనియర్ నేత గుడ్‌బై.. వైయస్ షర్మిల పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటన
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైయస్ షర్మిల కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ద్వారా..
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైయస్ షర్మిల కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ద్వారా రాజన్న రాజ్యం తెస్తామంటూ షర్మిల కార్యాచరణకు దిగారు. వివిధ జిల్లాల్లోని వైయస్ అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె పార్టీ పేరు.. జెండా.. ఎజెండా ఖరారు కానే లేదు. కానీ.. అప్పుడు కొందరు నాయకులు షర్మిల వైపు చూస్తున్నారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ దయానంద్ రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్‌కు చెందిన కె.ఎస్. దయానంద్(డేవిడ్) ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌కు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డికి పంపించినట్లు దయానంద్ తెలిపారు.
అనంతరం ఆయన తన అనుచరులతో కలిసి లోటస్ పాండ్‌లో త్వరలో పార్టీ పెట్టనున్న షర్మిలతో సమావేశమయ్యానని తెలిపారు. అంతేకాదు షర్మిలకు మద్దతు కూడా ప్రకటించానని తెలిపారు. షర్మిలకు మద్దతు ఇచ్చిన వారిలో మాజీ కార్పొరేటర్ కోరని శ్రీలత భర్త కోరని మహాత్మా, రాజేంద్రనగర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంబాల రాజేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కోరని ఉదయ్ కిరణ్, తదితరులు ఉన్నారు.
Read more:
బీజేపీకి ఎందుకు ఓటేయాలి..? కంపెనీలు ప్రైవేటుకు కట్టబెట్టినందుకా.. ఉద్యోగాలు ఊడగొట్టినందుకా..?